వెంకట్రామిరెడ్డి బాటలో ఏపీ ఐఎఎస్... మంత్రి బొత్స కాళ్లుమొక్కిన విజయనగరం జాయింట్ కలెక్టర్ (Video)

By Arun Kumar PFirst Published Jan 2, 2022, 2:00 PM IST
Highlights

తెలంగాణలో జిల్లా కలెక్టర్ గా పనిచేస్తుండగా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా మారారు. ఈయన బాటలోనే నడుద్దామని అనుకున్నాడో ఏమో గాని విజయనగరం కలెక్టర్ కూడే సేమ్ ఇలాగే మంత్రి బొత్స కాళ్లుమొక్కారు. 

విజయనగరం: బాధ్యతాయుతమైన కలెక్టర్ పదవిలో వున్న ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి (venkatram reddy) ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) కాళ్లుమొక్కడం తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా వుండాల్సిన జిల్లా కలెక్టర్ టీఆర్ఎస్ పార్టీ (trs  party) నాయకుడిలా కేసీఆర్ కాళ్లు మొక్కడమేంటని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కొంతమంది ప్రజలు కూడా ఐఎఎస్ అధికారిగా ఉన్నతస్థాయిలో వున్న అధికారి సీఎం కాళ్లు మొక్కడాన్ని తప్పుబట్టారు. 

అయితే నూతన సంవత్సరాది (new year 2022) సందర్భంగా మరో తెలుగురాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో సేమ్ అలాంటి సీనే రిపీట్ అయ్యింది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ (vijayanagaram jc) (రెవెన్యూ) గా పనిచేస్తున్న ఐపిఎస్ అధికారి సిహెచ్ కిశోర్ కుమార్ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) కాళ్లు మొక్కడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

Video

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి మంత్రి బొత్సను కలిసారు జాయింట్ కలెక్టర్. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతవరకు బాగానే వున్నా ఆ తర్వాత  జెసి కిశోర్ మంత్రి కాళ్లు మొక్కాడు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

read more  పెన్షన్ పెంపు.. ఇదేనా మాట తప్పను, మడమ తిప్పనంటే: జగన్‌పై అచ్చెన్నాయుడు విమర్శలు

బాధ్యతాయుతమైన జెసి పదవిలో వుండి రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా వుండాల్సిన వ్యక్తి ఇలా రాజకీయ నాయకుడి కాళ్లుపట్టుకోవడం ఏమిటని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మంత్రి వద్దంటున్నా జెసి వంగివంగి కాళ్లుమొక్కుతున్న వీడియో వైరల్ గా మారింది. విజయనగరం జెసి కిశోర్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే జెసి కిశోర్ కు కూడా రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడేమో... అందుకే సిద్దిపేట కలెక్టర్ గా వుండగా సీఎం కేసీఆర్ కాళ్లుమొక్కి ఇప్పుడు ఎమ్మెల్సీగా మారిన వెంకట్రామిరెడ్డిని ఫాలో అవుతున్నాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మంత్రిని ప్రసన్నం చేసుకోడానికే జాయింట్ కలెక్టర్ హోదాలో వున్న ఐఎఎస్ అధికారి ఇంతలా దిగజారడం మంచిది కాదని నెటిజన్లు, సామాన్య ప్రజలు అంటున్నారు. 

read more  రెక్కీ ఎవరు చేశారో బయట పెట్టాలి: వంగవీటి రాధాకు మంత్రి వెల్లంపల్లి డిమాండ్

ఇదిలావుంటే తెలంగాణలో కలెక్టర్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసి వెంటనే ఎమ్మెల్సీ పదవిని పొందారు మాజీ ఐఎఎస్ వెంకట్రామిరెడ్డి. సిద్దిపేట నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు వెంకట్రామిరెడ్డి. అయితే ఆయన చర్యను ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజానికం తప్పుబట్టారు. 

ఆ తర్వాత కూడా జిల్లాలోని రైతులెవ్వరూ వరి వేయవద్దంటూ వెంకట్రామిరెడ్డి హుకుం జారీ చేసారు. వరి వేస్తే రైతులకు ఉరేనని...  వచ్చే ఏడాది నుండి ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయదని వ్యాఖ్యానించారు. అయితే ఇలా కలెక్టర్ రైతులను బెదిరించే దోరణిలో మాట్లాడటం కూడి వివాదాస్పదమయ్యింది. 

అయితే ఇలా వివాదాస్పద కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కు సన్నిహితుడు కావడంతో బంపర్ ఆఫర్ కొట్టేసారు.  సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇలా పార్టీలో చేరాడో లేదో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఆయనను వరించింది.  

టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇతర పార్టీలు పోటీనుండి తప్పుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఆయనతో పాటు టీఆర్‌ఎస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడి యం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్‌రావు, బండా ప్రకాశ్‌ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డిలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
 

click me!