అమరావతిలోని 30 వేల ఎకరాల్లో 10 వేలు వెయ్యి మంది చేతుల్లోనే.. చిట్టా విప్పమంటారా : అసెంబ్లీలో బుగ్గన

By Siva KodatiFirst Published Sep 15, 2022, 2:48 PM IST
Highlights

అమరావతి రైతులిచ్చిన 30 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాలు ఒక వెయ్యి మంది చేతుల్లోనే వుందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాజధాని ప్రకటన వెలువడకముందే శ్రీకాకుళం, అనంతపురం ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం నేతలకు ఇంత దూరం వచ్చి అమరావతిలో భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. 

రాజధాని ఒక ప్రత్యేక ప్రాంతంలో వుంటే... మరోసారి హైదరాబాద్ విషయంలో జరిగినదే జరుగుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాజధాని అంశంపై ఆయన మాట్లాడుతూ.. శ్రీ బాగ్ ఒడంబడికలో చెప్పిన విధంగా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ లేదన్నారు. లంక, పోరంబోకు భూముల్ని తీసుకోవడం పట్టాలివ్వడం వంటి చర్యలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం పాల్పడిందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాజధాని అమరావతిలో రాబోతుందని .. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఎలా ముందే తెలుస్తుందని బుగ్గన ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు కుటుంబం అమరావతిలో 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. దీనికి అనుగుణంగా బౌండరీలు మార్చింది వాస్తవం కాదా అని ఆర్ధిక మంత్రి నిలదీశారు. కేవలం కొంతమంది చేతుల్లో అమరావతి భూములు వున్నాయని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రకటన వెలువడకముందే శ్రీకాకుళం, అనంతపురం ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం నేతలకు ఇంత దూరం వచ్చి అమరావతిలో భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతులిచ్చిన 30 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాలు ఒక వెయ్యి మంది చేతుల్లోనే వుందని బుగ్గన ఆరోపించారు. 

Also Read:చంద్రబాబు వ్యాపారిలా వ్యవహరించారు.. అమరావతిలో ధనికులే ఉండాలా..?: కొడాలి నాని

రియల్ ఎస్టేట్ సిండికేట్ కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడతారా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక భవనాల్లో వసతులు సరిగ్గా లేవని , కనీసం కిటికీలు కూడా లేవని ఆయన సెటైర్లు వేశారు. అమరావతిలో జరిగింది వ్యాపారామా లేక రాజధానా అని బుగ్గన ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్ కొడుకు విక్రమ్ సింహా కూడా భూములు కొన్నారని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. హెరిటేజ్ సంస్థ కూడా 14 ఎకరాల భూమి కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు. 

రాజధాని ప్రకటనకు ముందు ఎవరెవరు భూములు కొన్నారో అన్ని వివరాలు వున్నాయని బుగ్గన పేర్కొన్నారు. టీడీపీ నేతలు అమరావతిలో భూములు కొన్నది వాస్తవం కాదా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అంటే టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ అని బుగ్గన సెటైర్లు వేశారు. ఎస్సీల భూముల్ని బలవంతంగా లాక్కున్నారని.. విద్యుత్ బిల్లులే కాకుండా పాలు, గుడ్లు వంటి బిల్లులు కూడా పెండింగ్‌లో పెట్టారని ఆర్ధిక మంత్రి ఎద్దేవా చేశారు. 
 

click me!