మూడు రాజధానులంటే తలను మూడు ముక్కలు చేయడమే: ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిమ్మల

By narsimha lode  |  First Published Sep 15, 2022, 2:43 PM IST

పాలనను వికేంద్రీకరణను చేయవద్దని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కోరారు. పాలనా వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో  టీడీపీ ఎమ్మెల్యే  రామానాయుడు పాల్గొన్నారు. 


అమరావతి: అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి  కానీ, పాలన వికేంద్రీకరణ చేయవద్దని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు కోరారు. రాజధానిని మూడు ముక్కలు చేయడమంటే తలను మూడు ముక్కలు చేయడమేనని  ఆయన అభిప్రాయపడ్డారు

ఏపీ అసెంబ్లీలో పరిపాలనా  వికేంద్రీకరణపై గురువారం నాడు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు పాల్గొన్నారు.మూడు రాజధానులను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తాడికొండ, నందిగామ నియోజకవర్గాల మధ్య అమరావతి రాజధాని ఉందన్నారు. ఈ నియోజకవర్గాల్లో కాపులు 17 శాతం, కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు సమానంగా ఉన్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన  వర్గాలు అత్యధికంగా ఉన్నారని చెప్పారు. 

Latest Videos

undefined

రైతుల కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రాష్ట్రం కోసం రాజధాని కోసం  33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల కంట నీరు పెట్టుకోవడం రాష్ట్రానికి అరిష్టమన్నారు.   రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతిని రాజధానికిగా అంగీకరించారన్నారు. 

రాజధానికి కనీసం 30 వేల ఎకరాల భూమి అవసరమనే విషయాన్ని ఆనాడు వైఎస్ జగన్ కూడా మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. అధికారపక్షం,విపక్షంతో పాటు అన్ని పార్టీల ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించామని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు చెప్పారు. అమరావతిని అభివృద్ది చేయాలని చంద్రబాబు సంకల్పించారన్నారు. తెలంగాణకు హైద్రాబాద్ నుండే 61 శాతం ఆదాయం వస్తుందన్నారు. అదే తరహలో అమరావతిని అభివృద్ది చేయాలని తలపెట్టారన్నారు.

also read:నా పుట్టుక గురించి మంత్రి వ్యాఖ్యలు, రాజీనామాకు సిద్దం: ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి

హైద్రాబాద్, చెన్నై, బెంగుళూరుకుకు ధీటుగా రాజధాని రూపకల్పనకు శ్రీకారం చుట్టారన్నారు. రూ. 18 లక్షల కోట్ల బడ్జెట్  ఉన్నప్పటికీ కూడా  రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టామని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.  రాజధాని అమరావతిలో అసెంబ్లీ సహా పలు కార్యాలయాల నిర్మాణాన్ని చేపట్టినట్టుగా రామానాయుడు చెప్పారు.  కానీ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినా తర్వాత  అమరావతి నుండి పాలన జరుగుతుందంటే నాడు తమ ప్రభుత్వం చేపట్టిన పనులే కారణమన్నారు.  2019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు కూడ అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటించిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు అమరావతిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నారని కూడ వైసీపీ నేతలు ప్రకటించారన్నారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ మాట తప్పారని మా పార్టీతో పాటు  అన్ని పార్టీలు చెబుతున్నాయన్నారు. ఇందులో తప్పుందా అని ఆయన ప్రశ్నించారు 

ఈ విషయమై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. టీడీపీ హయంలో అమరావతిలో  టీడీపీ నేతల బూములు కొనుగోలు  చేశారన్నారు.ఈ మేరకు  జాబితాను మంత్రి అసెంబ్లీలో చదివి విన్పించారు.  ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే తన నిమ్మల రామానాయుడు తన ప్రసంగాన్ని కొనసాగించారు.ఈ సమయంలో కూడ మంత్రి బుగ్గన పదే పదే జోక్యం చేసుకోవడంపై కూడా నిమ్మల రామానాయుుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు ఒక్కి నిమిషం సమయం ఇస్తే అధికార పార్టీకి 20 నిమిషాలు సమయం ఇస్తే తాము చర్చలో పాల్గొనడంలో అర్ధం లేదన్నారు. 

రాయలసీమ సహ  ఉత్తరాంధ్ర అభివృద్దికి తమ ప్రభుత్వం ఆనాడు ప్రయత్నం చేసిందని రామానాయుడు చెప్పారు. అయితే ఈ సమయంలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ జోక్యం చేసుకున్నారు. విశాఖ గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్రగా పేర్కొన్నారు. ఆ తర్వాత మళ్లీ రామానాయుడు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా అమర్ నాథ్ మాట్లాడుతారన్నారు. గతంలో చంద్రబాబుకు మద్దతుగా అమర్ నాథ్ గొప్పగా మాట్లాడారని ఆయన సెటైర్లు వేశారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కాలేదన్నారు. ఈ సమయంలో మరోసారి ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.  గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశామో , మూడేళ్ల వైసీపీ  పాలనలో ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాయలసీమ గురించి మాట్లాడేహక్కే లేదు: బుగ్గన


ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతిలను అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో పనిచేసినట్టుగా ఆయన చెప్పారు.  ఈ సమయంలో మరోసారి మంత్రి బుగ్గన జోక్యం చేసుకున్నారు. రాయలసీమ గురించి మాట్లాడొద్దని టీడీపీ ఎమ్మెల్యేకు చేతులు జోడించి కోరుతున్నట్టుగా మంత్రి చెప్పారు. ప్రాజెక్టులకు చంద్రబాబు సరిగా నిధులు కేటాయించలేదన్నారు. సుజల స్రవంతి సహా పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అని ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేల కోట్లు ఖర్చు చేయడంతో ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి టీడీపికి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రైవేటీకరణను ప్రవేశ పెట్టింది తానేనని చంద్రబాబు చెప్పుకొంటారని  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. సీఎం కంటే సీఈఓగా చెప్పుకొనేందుకు చంద్రబాబు ఇష్టపడ్డారన్నారు.


 

 


 

click me!