చంద్రబాబు వ్యాపారిలా వ్యవహరించారు.. అమరావతిలో ధనికులే ఉండాలా..?: కొడాలి నాని

By Sumanth KanukulaFirst Published Sep 15, 2022, 2:37 PM IST
Highlights

పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ది సాధ్యం అని వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 16వేల గ్రామా సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు.

పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ది సాధ్యం అని వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 16వేల గ్రామా సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. గ్రామసచివాలయాలతో ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లారని అన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా అభివృద్ది చేయాలంటే మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయాలు కావాలని.. అంతటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ఆలోచన చేయాలని అన్నారు. 

రాష్ట్రాన్ని బాగు చేయాలని, పేదలను పైకి తీసుకురావాలని, అన్ని ప్రాంతాలను అభివృద్ది చెందాలనే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. కొందరు బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మూడు ప్రాంతాలు అభివృద్ది కోసమే వికేంద్రీకరణ అని చెప్పారు. చంద్రబాబు  హయాంలో దళితుల భూములను లాక్కున్నారని ఆరోపించారు. కర్నూలులో హైకోర్టు పెడితే ఏం వస్తుందని అంటున్నారని.. తక్కువ ఖర్చు పెట్టేది కర్నూలులోనేనని.. సీఎం సామాజిక వర్గం ఎక్కువగా ఉండేది అక్కడేనని చెప్పారు. కులం కోసమే రాజధానిని అమరావతి నుంచి తీసేస్తున్నారనేది నిజం కాదని తెలిపారు.  

అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాపారిలా వ్యవహరించారని ఆరోపించారు. భూములు కొన్నవాళ్లే అమరావతి రాజధాని కావాలంటున్నారని అన్నారు. పాదయాత్ర రాజధాని కోసమా?.. చంద్రబాబు కోసమా? అని ప్రశ్నించారు. ఖమ్మంలో కార్పొరేటర్‌గా గెలవరి రేణుకా చౌదరి.. అమరావతి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక్క ప్రాంతమే అభివృద్ది అయితే.. మిగతా ప్రాంతాలు ఏం కావాలని ప్రశ్నించారు. 

40 ఆలయాలను కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు దేవుడి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తనకు కావాల్సిన వారికి కారుచౌకగా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. అమరావతిలో ధనికులే ఉండాలా..? పేదలు ఉండొద్దా..? అని ప్రశ్నించారు. అమరావతిని కమరావతి, భ్రమరావతి చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. అమరావతి ప్రకటించక ముందు ఎకరం రూ. 50 లక్షలు ఉంటే.. గ్రాఫిక్స్‌తో ఎకరం రూ. 5 కోట్లుకు తీసుకెళ్లారని చెప్పారు. అమరావతిలో టీడీపీ నేతలందరికీ భూములు ఉన్నాయని.. ఇతర ప్రాంతాల్లోకి భూముల అమ్మి అమరావతిలో కొన్నారని విమర్శించారు. 

click me!