ఏపీ సైబర్ నెట్ స్కాం: విచారణకు హాజరైన హరిప్రసాద్ సహా మరో ఇద్దరు

By narsimha lode  |  First Published Sep 14, 2021, 12:54 PM IST

 ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో విచారణకు  సాంబశివరావు, హరిప్రసాద్, గోపిచంద్ లు మంగళవారం నాడు ఏపీ సీఐడీ ముందు హాజరయ్యారు. ఈ ముగ్గురిని విచారణకు రావాలని  సీఐడీ నోటీసులు జారీ చేసింది. 



అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలో ఏపీ సీఐడీ విచారణకు సాంబశివరావు, వేమూరి హరిప్రసాద్, గోపిచంద్ లు మంగళవారం నాడు హాజరయ్యారు.ఈ ముగ్గురిని విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో  ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ స్కాంలో విచారణకు గాను ఏపీ సీఐడి అధికారులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. 

also read:ఏపీ ఫైబర్‌నెట్ స్కాం: ముగ్గురికి సీఐడీ నోటీసులు, నేడు విచారణ

Latest Videos

undefined

వేమూరి హరిప్రసాద్‌, సాంబశివరావు, గోపీచంద్‌కు నోటీసులు ఇచ్చింది.  ఇవాళ విచారణకు రావాలని  ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది.ఏపీలో చంద్రబాబునాయుడు సర్కార్ మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంబశివరావు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తన వాదనను విన్పించనున్నట్టుగా వేమూరి హరిప్రసాద్ చెప్పారు. 

ఏపీ ఫైబర్ నెట్ లో రూ. 320 కోట్ల టెండర్లు పిలిస్తే రూ. 121 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలకి పాల్పడ్డారని ఏపీ సీఐడీ తేల్చింది.ఈ విషయమై విచారణకు రావాలని గత ప్రభుత్వహయంలో ఏపీ ఫైబర్ నెట్ లో కీలకంగా పనిచేసిన ముగ్గురికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.

బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించిన విషయాన్ని ఏపీ సీఐడీ గుర్తించింది. టెండర్లలో పాల్గొనేందుకు టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు. ఈ కుంభకోణంలో  ఇప్పటికే 19 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.


 

click me!