ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ: కూన రవికుమార్ పై చర్యలకు నిర్ణయం

By narsimha lode  |  First Published Sep 14, 2021, 12:16 PM IST


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం నాడు  అమరావతిలో ప్రారంభమైంది.ఈ సమావేశానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా హాజరయ్యారు.ఈ సమావేశానికి ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని  ప్రివిలేజ్ కమిటీ కోరింది. అయితే గత సమావేశానికి ఆయన వ్యక్తిగతంగా హాజరుకాలేదు.కూన రవికుమార్ పై ఈ సమావేశంలో ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం నాడు  అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రారంభమైంది.ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా హాజరయ్యారు. గత సమావేశానికి వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేనని ఆయన కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ ఆయన వ్యక్తిగతంగా సమావేశానికి హాజరయ్యారు.

also read:ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ: హాజరు కాని అచ్చెన్న, కూన రవికుమార్, కమిటీ సీరియస్

Latest Videos

undefined

మాజీ ఎమ్మెల్యే టీడీపీనేత కూన రవికి ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆయనపై ప్రివిలేజ్ కమిటీ గత సమావేశంలోనే సీరియస్ అయింది. ఈ సమావేశంలో కూన రవికుమార్ పై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. అయితే తనకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు అందలేదని కూన రవికుమార్ చెబుతున్నారు. మరోవైపు టీడీపీ శాసనసభపక్ష ఉపనాయకుడు నిమ్మల రామానాయుడుకు కూడ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

తాను చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ కమిటీకి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. అయితే తాను అందుబాటులో లేని గతంలో కూన రవికుమార్ చేసిన ప్రకటనపై ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. అందుబాటులో ఉండి కూడ అవాస్తవాలు చెప్పారని కమిటీ అభిప్రాయపడింది. కూన రవికుమార్ అవాస్తవాలు చెప్పారనే విషయానికి ఆధారాలున్నాయని కమిటీ తేల్చి చెప్పింది. ఆధారాలను పరిశీలించిన తర్వాత కూన రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొంది సమావేశం. ఈ నెల 21న మరోసారి సమావేశం కావాలని  నిర్ణయం తీసుకొన్నారు చైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి.

click me!