కడప: కసాయి భర్త వేధింపులతో... పెళ్లయిన నెలరోజులకే నవవధువు ఆత్మహత్య (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 14, 2021, 12:21 PM IST
కడప: కసాయి భర్త వేధింపులతో... పెళ్లయిన నెలరోజులకే నవవధువు ఆత్మహత్య (వీడియో)

సారాంశం

పెళ్లయి నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కడప జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. 

కడప: ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన కొత్తపెళ్లికూతురు నెలరోజులు కూడా అత్తవారింట్లో జీవించలేకపోయింది. పెళ్లయి అత్తవారింట్లో కాలుమోపింది మొదలు మొగుడి వేధింపులు ప్రారంభమయ్యాయి. నిండునూరేళ్ళు ఆనందంగా చూసుకుంటాడనుకున్న వాడే ఇలా వేధింపులకు పాల్పడటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో పెళ్లయి నెలరోజులు కూడా కాకముందే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.  

కడప జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన రాధాకృష్ణతో ఝాన్సికి కొద్దిరోజుల క్రితమే పెళ్లయింది. అయితే రాధాకృష్ణ కుటుంబం రాజంపేటలోని బోయినపల్లిలో నివాసముండగా అతడు ఉపాధి నిమిత్తం కడపలో వుండేవాడు. దీంతో పెళ్లి తంతంగమంతా ముగిసిన తర్వాత భార్యను తీసుకుని కడప పట్టణంలోని  నెహ్రు నగర్ లో కాపురం పెట్టాడు.  

read more  కల్వర్టును ఢీకొన్న కారు.. మామ, కోడలి మృతి

ఇలా కొత్తజీవితాన్ని ప్రారంభించిన ఝాన్సీని భర్త నిత్యం వేధించసాగాడు. నిత్యం భర్త వేధిస్తుండటాన్ని తట్టుకోలేకపోయిన ఝాన్సీ దారుణ నిర్ణయం తీసుకుంది. నివాసముండే ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని  ఆత్మహత్య చేసుకుంది. భర్త రాధాకృష్ణ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ ఆత్మహత్య చేసుకుంది.  

వీడియో

వివాహిత ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఝాన్సి మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్