ఇతర రాష్ట్రాల నుండి 3 మద్యం బాటిల్స్‌కి ఏపీ హైకోర్టు ఒకే: సవాల్ చేయనున్న ఎక్సైజ్ శాఖ

By narsimha lodeFirst Published Sep 8, 2020, 2:19 PM IST
Highlights

: ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకొనేందుకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిళ్లను తీసుకొస్తే అక్రమ మద్యం రవాణా పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.

అమరావతి: ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకొనేందుకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిళ్లను తీసుకొస్తే అక్రమ మద్యం రవాణా పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 65 శాతం మద్యం విక్రయాలు తగ్గాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.  ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. దీని కారణంగా ఇతర రాష్ట్రాల నుండి దొంగచాటుగా మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ రవాణాను అరికట్టేందుకు మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.

ఇదిలా ఉంటే ఈ నెల 2వ తేదీన ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 411 జీవో ప్రకారంగా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లను రాష్ట్రంలోకి తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఏపీ ఎక్సైజ్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పుతో రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా సాగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అభిప్రాయపడుతోంది.

also read:మద్యం ప్రియులకు ఏపీ హైకోర్టు గుడ్‌న్యూస్: ఇతర రాష్ట్రాల నుండి 3 మద్యం బాటిల్స్ కు అనుమతి

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. వీటిలో 11 జిల్లాలకు ఇతర రాష్ట్రాల సరిహద్దులున్నాయి. మద్యం అవసరం ఉన్నవారు పక్క రాష్ట్రాలకు వెళ్లి మద్యం తెచ్చుకొనే అవకాశం లేకపోలేదు. మరో వైపు ఈ తీర్పును ఆసరా చేసుకొని వ్యాపారం చేసేందుకు కూడ అక్రమార్కులు పూనుకొనే అవకాశం కూడ లేకపోలేదని ఎక్సైజ్ శాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

also read:ఏపీలో భారీగా పడిపోయిన మద్యం విక్రయాలు: రూ.2,885.82 తగ్గిన ఆదాయం

హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కూడ ఎక్సైజ్ శాఖ నివేదిక ఇచ్చింది.

హైకోర్టు తీర్పు కారణంగా రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా యధేచ్ఛగా సాగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అభిప్రాయంతో ఉంది. ఈ తీర్పును సవాల్ చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

click me!