Andhra Pradesh: టీడీపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారి నాలుకలు తెగ్గొసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మళ్లీ ఏపీలో రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నాయి. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు, రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైకాపా నాయకులను టార్గెట్ చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైకాపా నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే.. వారి నాలుకను తెగ్గోసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పలు గ్రామాలలో గౌరవ సభ- ప్రజా సమస్యల చర్చా వేదిక కార్యక్రమాల్లో పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
Also Read: Miss Universe 2021 : భారత సుందరి హర్నాజ్ సంధుదే కిరీటం..!
అధికార పార్టీ వైసీపీ నేతలే టార్గెట్‌గా ప్రస్తుతం పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కాకరేపుతున్నాయి. అలాగే, ఇటీవలి కాలంలో వైసీపీ నేతల మాటలు హద్దులు మీరుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి ధృఢసంకల్పం, గంభీరమైన వ్యక్తితోనే వీరు కన్నీరు పెట్టించారంటే.. వైసీపీ నేతలు అన్న మాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అధికా నేతలు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని అన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చూస్తే కూర్చోమని హెచ్చరించారు. అలాంటి వారి నాలుకలను తెగ్గొసివేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె సీఎం జగన నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వంపైనా ఘాటైన విమర్శలు గుప్పించారు. అలాగే, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిపైనా సంచలన కామెంట్స్ చేశౄరు.
Also Read: Himachal Pradesh: భారీ అగ్ని ప్రమాదం.. 27ఇండ్లు దగ్ధం
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై భూదందాలకు పాల్పడుతున్నారని పరిటిలా సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సోదరులు రాప్తాడు నుంచి పెనుకొండ వరకు భూముల సెటిల్‌మంట్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. చెన్నేకొత్తపల్లిలోని ఒక డాబాలో, అనంతపురం రూరల్ లో ఒక కళ్యాణమండపంలో, రాప్తాడులోని ఒక తోటలోని గెస్ట్ హౌసుల్లో పంచాయతీలు జరుగుతున్నాయన్నారు. సామాన్యుల మధ్య భూతగాదాలు పెట్టడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే వారి వద్ద నుంచి పెట్టి వారి డబ్బు గుంజడమే అసలైన పని గా పెట్టుకున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తన సోదరులపై తీవ్ర దుష్ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటూ వైసీపీ నేతలను, ఎమ్మెల్యేను పరిటాల సునీత నిలదీశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 5కోట్లతో ఒక ఇళ్లు, అనంతపురంలో ఒక ఇళ్లు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. అధికార నేతల అవినీతి పెరిగిపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. రాష్ట్రలో ఉద్యమం ఊపందుకుంటోంది. ఆదివారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్షకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగడంతో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనాసాగుతోంది.
Also Read: Afghanistan hunger crisis: ఆకలి కేకల ఆఫ్ఘాన్..