వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు అంబటి రాంబాబు (ambati rambabu). పవన్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారని.. ఈసారి మూడు చోట్ల పోటీచేయాలంటూ అంబటి సెటైర్లు వేశారు. పనవ్ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఎవరికీ తెలియదన్నారు.
వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు అంబటి రాంబాబు (ambati rambabu). పవన్ తీరు ఏది చెప్పినా ఆవు కథ వ్యాసం రాసే వారిలా వుందంటూ ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు (vizag steel) గురించి దీక్ష చేస్తున్నానని చెప్పిన ఆయన.. ఉపన్యాసంలో ఎక్కడా విశాఖ ఉక్కు ప్రస్తావనే తీసుకురాలేదంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. బీజేపీతో (bjp) పార్ట్‌నర్‌గా వుండి ఉక్కు ప్రైవేటీకరణ గురించి మాట్లడవా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదాను (ap special status) చంద్రబాబు (chandrababu naidu) వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారని రాంబాబు మండిపడ్డారు. కేంద్రం అప్పు రూ.121 లక్షల కోట్లా.. మరి దేశాన్నీ అమ్మేయాలంటారా అని అంబటి ప్రశ్నించారు.
1972లో దామోదరం సంజీవయ్య (damodaram sanjeevaiah) చనిపోతే పవన్‌కు ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ రాంబాబు ఫైర్ అయ్యారు. వారసత్వ రాజకీయాలను ఎదుర్కొన్నాడు కనుకే.. మోడీ అంటే నాకు ఇష్టమని పవన్ అంటున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లోనే వారసత్వాలకు వ్యతిరేకమా.. మరి సినిమాల్లో వారసత్వాలకు వ్యతిరేకం కాదా అని అంబటి ప్రశ్నించారు. రాజధాని గురించి పవన్ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయారా అని రాంబాబు నిలదీశారు. జనసేనను అధికారంలోకి తేవాలని అడిగే హక్కు పవన్‌కు లేదన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని మేమూ చెబుతున్నామని.. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి అని.. కేంద్రాన్ని అడిగే ధైర్యం పవన్‌కు లేదా అని రాంబాబు సవాల్ విసిరారు.
Also Read:నాతో పంతానికి దిగితే.. ఫ్రీగా సినిమాలు ఆడిస్తా : జగన్‌కు పవన్ కల్యాణ్ హెచ్చరిక
మిత్రులను అడిగే థైర్యం లేనివాళ్లకు .. మమ్మల్ని అడిగే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్రంపై తాము పోరాటం చేస్తున్నామని.. పవన్‌కు దమ్ము, చిత్తశుద్ధి వుంటే ఫ్లకార్డులు పట్టుకుని బీజేపీ కార్యాలయం ముందు నిలబడాలని రాంబాబు డిమాండ్ చేశారు. పవన్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారని.. ఈసారి మూడు చోట్ల పోటీచేయాలంటూ అంబటి సెటైర్లు వేశారు. పనవ్ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఎవరికీ తెలియదన్నారు. సమస్యలపై పూర్తి స్పష్టత తీసుకుని పవన్ కల్యాణ్ మాట్లాడాలని రాంబాబు హితవు పలికారు. నాలుగు రోజులు రాజకీయాలు, ఏడాది సినిమాలు చేయడమే పవన్ పని అంటూ ఆయన సెటైర్లు వేశారు.