విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. మాట్లాడాల్సింది కేంద్రం దగ్గర : పవన్‌ దీక్షకు సుచరిత కౌంటర్

By Siva Kodati  |  First Published Dec 12, 2021, 8:42 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షపై స్పందించారు హోంమంత్రి మేకతోటి సుచరిత (mekathoti sucharitha) ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సుచరిత.. ప్రత్యేక హోదా కోసం ఆనాడు ప్యాకేజీ, ఇప్పుడు రాజీనామాలు అంటున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు


జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షపై స్పందించారు హోంమంత్రి మేకతోటి సుచరిత (mekathoti sucharitha) ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సుచరిత.. ప్రత్యేక హోదా కోసం ఆనాడు ప్యాకేజీ, ఇప్పుడు రాజీనామాలు అంటున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని సుచరిత ఎద్దేవా చేశారు.

జిల్లా పరిషత్ సమావేశానికి హాజరుకాని అధికారులు రెండవ దఫా హాజరు కావాలని ఆమె ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశానికి హాజరుకాని వారిని రెండవ దఫా ఉపేక్షించేది లేదని సుచరిత హెచ్చరించారు. రైతులు కల్తీ విత్తనాలు, తేగుల్లు, వరదల వల్ల ఇబ్బందులకు గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాల వల్ల నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. రైతులకు కల్తీ విత్తనాలు అమ్మే వారిపై చర్యలు తప్పవని సుచరిత హెచ్చరించారు. 

Latest Videos

undefined

ALso Read:నాలుగు రోజులు రాజకీయాలు, ఏడాది సినిమాలు.. ఈసారి మూడు చోట్ల పోటీ చేయ్ : పవన్‌కు అంబటి చురకలు

అంతకుముందు వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు అంబటి రాంబాబు (ambati rambabu). పవన్ తీరు ఏది చెప్పినా ఆవు కథ వ్యాసం రాసే వారిలా వుందంటూ ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు (vizag steel) గురించి దీక్ష చేస్తున్నానని చెప్పిన ఆయన.. ఉపన్యాసంలో ఎక్కడా విశాఖ ఉక్కు ప్రస్తావనే తీసుకురాలేదంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. బీజేపీతో (bjp) పార్ట్‌నర్‌గా వుండి ఉక్కు ప్రైవేటీకరణ గురించి మాట్లడవా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదాను (ap special status) చంద్రబాబు (chandrababu naidu) వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారని రాంబాబు మండిపడ్డారు. కేంద్రం అప్పు రూ.121 లక్షల కోట్లా.. మరి దేశాన్నీ అమ్మేయాలంటారా అని అంబటి ప్రశ్నించారు. 

1972లో దామోదరం సంజీవయ్య (damodaram sanjeevaiah) చనిపోతే పవన్‌కు ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ రాంబాబు ఫైర్ అయ్యారు. వారసత్వ రాజకీయాలను ఎదుర్కొన్నాడు కనుకే.. మోడీ అంటే నాకు ఇష్టమని పవన్ అంటున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లోనే వారసత్వాలకు వ్యతిరేకమా.. మరి సినిమాల్లో వారసత్వాలకు వ్యతిరేకం కాదా అని అంబటి ప్రశ్నించారు. రాజధాని గురించి పవన్ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయారా అని రాంబాబు నిలదీశారు. జనసేనను అధికారంలోకి తేవాలని అడిగే హక్కు పవన్‌కు లేదన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని మేమూ చెబుతున్నామని.. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి అని.. కేంద్రాన్ని అడిగే ధైర్యం పవన్‌కు లేదా అని రాంబాబు సవాల్ విసిరారు. 

 

click me!