బ్రహ్మంగారి మఠం వివాదం.. శివస్వామి ఎంపిక చెల్లదు, త్వరలోనే పీఠాధిపతి నిర్ణయం: వెల్లంపల్లి

By Siva KodatiFirst Published Jun 18, 2021, 9:12 PM IST
Highlights

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం స్పందించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు . కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాన్ని శుక్రవారం మంత్రి వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు.  

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం స్పందించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు . కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాన్ని శుక్రవారం మంత్రి వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో కుటుంబసభ్యుల మధ్య గత కొంతకాలంగా వివాదం నెలకొన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులందరితో వెల్లంపల్లి విడివిడిగా చర్చలు జరిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అందరూ ఏకాభిప్రాయానికి రావాలని కోరినట్టు వెల్లడించారు. 3 రోజుల్లో వారే స్వయంగా కూర్చుని మాట్లాడుకుంటామని చెప్పినట్లుగా తెలిపారు.

కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు ఉండటం సహజమేనని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదని, వారిని దేవాదాయశాఖ పంపించిందనడం అవాస్తవమని తేల్చిచెప్పారు. దేవాదాయశాఖకు పీఠాధిపతుల బృందానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పీఠాధిపతి నిర్ణయం కొలిక్కి రాకపోతే దేవాదాయశాఖ, ధార్మిక పరిషత్‌ ఒక నిర్ణయం తీసుకుంటాయని మంత్రి వెల్లడించారు. 

Also Read:ఆ వీలునామా చెల్లదు: బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపికపైశివస్వామి సంచలనం

కాగా, వీరభోగవెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ వద్ద ఉన్న వీలునామా చెల్లదని విజయవాడకు చెందిన పీఠాధిపతి శివ స్వామి చెప్పారు.ఆదివారంనాడు ఆయన కందిమల్లాయిపల్లె గ్రామానికి మరో 13 మందితో కలిసి ఆయన సందర్శించారు. బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో తాము ప్రభుత్వం తరపున  ప్రతినిధిగా రాలేదన్నారు. విశ్వధర్మ పరిరక్షణ వేదిక తరపున వివాదానికి తెర దింపే ప్రయత్నం చేసేందుకు వచ్చామని ఆయన తెలిపారు. 

దేవాదాయశాఖతో సంబంధం లేకుండా పీఠాధిపతిని ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. వారసత్వంగా పెద్ద కొడుకు వెంకటాద్రికే పిఠాధిపతి పదవి  దక్కనుందని ఆయన చెప్పారు.బ్రహ్మంగారి మఠానికి ప్రత్యేకాధికారిని నియమించడం సంతోషమన్నారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో కుటుంబంలో వివాదం చోటు చేసుకొంది.

click me!