రాజకీయాల్లో నువ్వు కామెడీ యాక్టర్‌వే.. లీడర్‌వి కావు, కాలేవు: లోకేశ్‌పై టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శలు

Siva Kodati |  
Published : Jun 18, 2021, 07:37 PM IST
రాజకీయాల్లో నువ్వు కామెడీ యాక్టర్‌వే.. లీడర్‌వి కావు, కాలేవు: లోకేశ్‌పై టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శలు

సారాంశం

టీడీపీ నేత నారా లోకేశ్‌పై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మైండ్ యువర్ టంగ్ లోకేష్ అంటూ హెచ్చరించారు. సంస్కార హీనుడిగా లోకేష్‌ను పెంచినందుకు చంద్రబాబు సిగ్గుపడుతూ లెంపలేసుకోవాలని సుధాకర్ బాబు అన్నారు

టీడీపీ నేత నారా లోకేశ్‌పై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మైండ్ యువర్ టంగ్ లోకేష్ అంటూ హెచ్చరించారు. సంస్కార హీనుడిగా లోకేష్‌ను పెంచినందుకు చంద్రబాబు సిగ్గుపడుతూ లెంపలేసుకోవాలని సుధాకర్ బాబు అన్నారు. ప్రజా నాయకుడ్ని తూలనాడితే నాయకుడివి కాలేరని.. అసలే లోకేష్ కు "పప్పు" అని పిచ్చ పాపులారిటీ ఉందని టీజేఆర్ సెటైర్లు వేశారు.

వంగవీటి రంగా నుంచి నారాయణరెడ్డి వరకు.. హత్యా రాజకీయాలతో టీడీపీ పసుపు రంగుఎరుపుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజారెడ్డి హంతకులకు చంద్రబాబు ఆశ్రయమిస్తే..  వైయస్ కుటుంబం హంతకుల్ని సైతం క్షమించి వదిలేసిందని టీజేఆర్ గుర్తుచేశారు.  బ్రాహ్మణితో తన్నులు తినో, తిట్టడంతోనో.. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కెళ్ళి లోకేష్ పిచ్చి రంకెలు వేస్తున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:ప్యాక్షన్ రెడ్డి గీత దాటావ్... ఇక నీ సరదా తీరుస్తాం..: జగన్ కు లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

రాజకీయాల్లో కామెడీ యాక్టర్‌గా లోకేష్ మిగిలిపోతాడని.. ఎన్నటికీ నాయకుడిగా ఎదగలేడని సుధాకర్ బాబు ఆరోపించారు. పత్తిపాడులో నారాయణరెడ్డిని సుపారీ ఇచ్చి హత్య చేయించింది మీ తండ్రీకొడుకులు కాదా అని ఆయన నిలదీశారు. తుపాకీ పేల్చిన మీ మామ తుపాకీతోనే, వెన్నుపోటు పొడిచిన మీ తండ్రి వెన్నుపోటుతోనే పోతారని చెప్పదలిచావా అంటూ లోకేశ్‌పై సుధాకర్ బాబు ఫైరయ్యారు. దొడ్డిదారిన లభించిన ఎమ్మెల్సీ పదవి పోతుందని నారా లోకష్‌ తీవ్ర నిరాశలో ఉన్నారని.. శరీరం సైజు తగ్గినా లోకేష్‌ బుద్ధి మాత్రం మారలేదని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్