డిసెంబర్‌లోపే ముహూర్తం.. జగన్‌ని అడ్డుకోలేరు: విశాఖ రాజధానిపై గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 18, 2021, 8:14 PM IST
Highlights

విశాఖ పరిపాలనా రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలన చేయవచ్చని స్పష్టం చేశారు. విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలించడానికి ఎవరి అనుమతి అవసరం లేదని అమర్‌నాథ్ తేల్చిచెప్పారు.

విశాఖ పరిపాలనా రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలన చేయవచ్చని స్పష్టం చేశారు. విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలించడానికి ఎవరి అనుమతి అవసరం లేదని అమర్‌నాథ్ తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని దేశంలో ఎవరూ అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోపే సీఎం విశాఖ నుంచి పాలన ప్రారంభించే అవకాశం వుందని అమర్‌నాథ్ చెప్పారు. ఆలస్యమైనా ఈ ఆర్ధిక సంవత్సరంలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనకు సరిపడా మౌలిక సదుపాయాలు విశాఖలో ఉన్నాయని అమర్‌నాథ్ పేర్కొన్నారు. 

అంతకుముందు ఓ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అధికార భాషా సంఘం కార్యాలయాన్ని తొలిసారిగా విశాఖకు తరలించిన ఘనత ఆ సంస్థ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కే దక్కుతుందన్నారు . యార్లగడ్డ రాసిన ‘‘పదకోశం- మనకోసం’’ పుస్తకావిష్కరణ సభలో విజయసాయి ఈ కామెంట్లు చేశారు. తెలుగు భాషకు యార్లగడ్డ విశేషమైన సేవ చేశారని ప్రశంసించారు. అధికార భాషా సంఘం కార్యాలయం విశాఖకు తరలింపు అంశం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని విజయసాయి వ్యాఖ్యానించారు. తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా రావడం వెనుక లక్ష్మీప్రసాద్ ఎంతో కృషి చేశారని ఎంపీ తెలిపారు. 

Also Read:రాజధాని తరలింపులో కీలక ఘట్టం... విశాఖకు అధికార భాషా సంఘం కార్యాలయం: విజయసాయిరెడ్డి

గురువారం కూడా మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలిస్తామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆ సంకేతాలు అందుతున్నాయని చెప్పారు. ముహూర్తం నిర్ణయం కాలేదు కానీ రాజధాని త్వరలో రావడం ఖాయమని విజయసాయి చెప్పారు. విశాఖ సమగ్ర అభివృద్ధిపై ఆయన గురువారం మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. రూ.3000 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విజయసాయి తెలిపారు. 

click me!