ఇష్టం వుంటేనే తీసుకుంటాం.. బలవంతం లేదు: ఎయిడెడ్ స్కూల్స్ అప్పగింతపై మంత్రి ఆదిమూలపు క్లారిటీ

By Siva Kodati  |  First Published Oct 27, 2021, 5:13 PM IST

ప్రైవేట్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థల (private aided schools) అప్పగింతపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి (ap education minister) ఆదిమూలపు సురేశ్ (adimulapu suresh) స్పందించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదని ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విద్యాసంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుందని తెలిపారు. 


ప్రైవేట్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థల (private aided schools) అప్పగింతపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి (ap education minister) ఆదిమూలపు సురేశ్ (adimulapu suresh) స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై కమిటీ వేశామని చెప్పారు. కొన్ని పత్రికలు కావాలనే తమపై.. తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతం పెట్టలేదని ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విద్యాసంస్థల అంగీకారంతోనే ప్రభుత్వం వాటిని తీసుకుందని తెలిపారు. కమిటీ  ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని సురేశ్ వెల్లడించారు. విద్యాసంస్థల అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయాలు  తీసుకుందని .. ఒకవేళ ప్రైవేట్‌ విద్యాసంస్థలు తామే నడుపుకుంటామంటే స్కూళ్లను వెనక్కి తీసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

కొన్ని చోట్ల పాఠశాలల్లో కనీస వసతులు లేవని .. తల్లిదండ్రులపై ఎలాంటి బలవంతపు ఒత్తిడి చేయడం లేదని ఆదిమూలపు సురేశ్ అన్నారు. విద్యార్థులకు.. దగ్గరలో ఉన్న స్కూల్స్‌లో చేరేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనిపై కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో వసతులు కల్పించకుండా పోస్ట్‌లు ఖాళీగా ఉంచిందని సురేశ్ ఎద్దేవా  చేశారు.

Latest Videos

Also Read:కాంట్రాక్ట్ లెక్చరర్లకు సీఎం జగన్ షాక్.. 700మంది ఉద్యోగాలు హుష్ కాకి..!

ఏపీలో నాణ్యమైన విద్యను అందించడానికి సీఎం (ys jagan mohan reddy) కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. కార్పొరేట్‌కు ధీటుగా విద్యా విధానం ఉండాలనే..  తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సురేశ్ చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి ఓ‍ర్వలేక..  ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తల్లిదండ్రులను అడ్డం పెట్టుకొని  రాజకీయం చేస్తున్నారని.. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయడం దుర్మార్గమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రైవేట్‌ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఎలా వచ్చాయో కూడా తెలియని వాళ్లు కూడా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై ఆదిమూలపు మండిపడ్డారు. తమ ప్రభుత్వం.. విద్యా రంగం అభివృద్ధికి సంస్కరణల్లో భాగంగానే చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రెగ్యులేటరీ కమిషన్ ఫిక్స్ చేసిన ఫీజ్ కంటే అధిక మొత్తం వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రతి పక్షాలు బాధ్యతగా నిర్మాణాత్మక ఆరోపణలు, సూచనలు చేయాలని సురేష్‌ హితవు పలికారు. 
 

click me!