టూరిజానికి ‘‘ఏపీ’’ కేరాఫ్ అడ్రస్ కావాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

By Siva KodatiFirst Published Oct 27, 2021, 4:50 PM IST
Highlights

పర్యాటక రంగానికి (tourism ) 'ఏపీ' చిరునామాగా మారాలన్నారు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

పర్యాటక రంగానికి (tourism ) 'ఏపీ' చిరునామాగా మారాలన్నారు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan mohan reddy). స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన బుధవారం సమీక్షా సమావేశం చేపట్టారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటి ద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కనున్నాయి. 

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. టూరిజం అంటే ఏపీ వైపే చూడాలన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలని.. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని సీఎం సూచించారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్థాయి పెరుగుతుందని సీఎం ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి పెరుగుతాయని సీఎం అన్నారు. విశాఖపట్నంలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలి అని అధికారులను జగన్‌ ఆదేశించారు. 

కాగా.. మంగళవారం (ysr rythu bharosa 2nd installment) వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ నిధులను (pm kisan) సీఎం జగన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ రైతుభరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ (ysr sunna vaddi), వైఎస్సార్‌ యంత్ర సేవాపథకం (ysr yantra seva).. ఈ మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ముఖ్యమంత్రి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేశారు.

Also Read:జగన్ సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద 2019 నుంచి ప్రతి ఏటా మూడువిడతల్లో రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీనిలో రూ.7500 మే నెలలోను, రూ.4 వేలు అక్టోబర్‌లోను, మిగిలిన రూ.2 వేలు జనవరిలోను జమ చేస్తున్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతోపాటు దేవదాయ, అటవీభూముల సాగుదారులతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ప్రాంత రైతులకు రూ.13,500 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది.

ఈ ఏడాది ఖరీఫ్‌ కోతలు, రబీ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద రెండోవిడత పెట్టుబడి సాయంగా 50.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,052 కోట్లను జమచేయనున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు తొలివిడతలో దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.7,500 చొప్పున రూ.3,811.96 కోట్లు జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌలుదారులు, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులతో సహా 50.37 లక్షల మందికి రెండోవిడత సాయం అందిస్తోంది.   

click me!