ఏపి ఆర్థిక సర్వే 2019-20 విడుదల... కీలక అంశాలివే

Arun Kumar P   | Asianet News
Published : Jun 15, 2020, 10:06 PM IST
ఏపి ఆర్థిక సర్వే 2019-20 విడుదల... కీలక అంశాలివే

సారాంశం

2019-20 సంవత్సరానికి సంబంధించిన ఆర్ధిక సర్వేను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 

అమరావతి:  2019-20 సంవత్సరానికి సంబంధించిన ఆర్ధిక సర్వేను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో నవరత్నాలు, ఆర్ధికవృద్ధి, విద్య- వైద్యం, సామాజిక, సంక్షేమం, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల వృద్ధి, నైపుణ్యాల వృద్ధి, ఉపాధి కల్పన, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అధికార వికేంద్రీకరణ వున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. 

''గత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర ఉత్పత్తి రేటు 8.16 శాతంగా నమోదయ్యింది.  గతేడాది స్ధూల జాతీయోత్పత్తిని మించి రాష్ట్ర ఉత్పత్తి నమోదయ్యింది. గతేడాది జీఎస్‌డీపీ అంచనాల విలువ రూ. 9,72,782 కోట్లుగా వుందని...2018-19 జీఎస్‌డీపీ అంచనా రూ. 8,62,957 కోట్లతో పోలిస్తే ఇది 12.73 శాతం వృద్ధి. జీఎస్‌డీపీ వ్యవసాయ రంగంలో  రూ. 3,20,218 కోట్లుగా, పారిశ్రామిక రంగంలో రూ.1,91,857 కోట్లుగా, సేవల రంగంలో  రూ. 3,67,747 కోట్లుగా నమోదయ్యింది'' అని ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.

గతేడాది వ్యవసాయ రంగంలో 11.67 శాతం, పారిశ్రామిక రంగంలో 5.67 శాతం, సేవల రంగంలో వృద్ధి 9.11 శాతంగా నమోదయ్యింది. దీంతో గతేడాది  రాష్ట్ర తలసరి ఆదాయం 12.14 పెరిగి రూ.1,69,519గా నమోదయ్యింది.  జాతీయ స్ధాయిలో అక్షరాస్యత రేటు 72.98 శాతంగా వుండగా ఏపీలో 67.35 శాతంగా వుంది. జగనన్న అమ్మఒడి కింద 42.33 లక్షల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.6336.45 కోట్ల నగదు జమ చేసినట్లు ఈ సర్వేలో పేర్కోన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పుతో 35.99 లక్షల పిల్లలకు  లబ్ది జరిగినట్లు... నాడు-నేడు పథకంతో 15,715 స్కూళ్ల రూపురేఖలు మారనున్నట్లు వెల్లడించారు. 

''జగనన్న విద్యాదీవెన  పథకంతో 13.26 లక్షల విద్యార్ధులకు 3329.49 కోట్ల సాయం అందగా, జగనన్న వసతి దీవెన పథకంతో 8.08 లక్షల విద్యార్దులకు రూ.2087 కోట్ల సాయం అందింది. జగనన్న గోరుముద్దతో 36 లక్షల మంది పిల్లలకు రూ.1105 కోట్ల ఖర్చుతో లబ్ది చేకూరింది'' అని ఈ సర్వే ద్వారా తెలిపారు.

read more   అసెంబ్లీకి నల్లచొక్కాలతో హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయం

'' వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో 144 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల వరకూ సాయం అందింది. గతేడాది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2.70 లక్షల రోగులకు సాయం అందించాం. ఆసరా పింఛన్ల ద్వారా 54.68 లక్షల మందికి లబ్ది జరగ్గా ప్రభుత్వంపై రూ.15,365 కోట్ల భారం పడింది. రైతు భరోసా కింద 46.69 లక్షల మంది రైతులకు రూ.6 వేల చొప్పున రూ.6534 కోట్ల సాయం చేశాం. రైతులకు గతేడాది ఉచిత భీమా సబ్సిడీ చెల్లింపు కోసం రూ. 1270 కోట్ల చెల్లించాం.రైతులకు రూ.1 లక్ష వరకూ పంట రుణాలు చెల్లించాం'' అని ప్రభుత్వం వెల్లడించింది. 

''ఆత్మహత్య చేసుకున్న రైతులు, మత్యకారుల కుటుంబాలకు రూ.7 నుండి రూ.10 లక్షల వరకూ పరిహారం చెల్లించాం. మత్స్యకార భరోసా కింద వేట లేని కాలంలో రూ.10 వేల సాయం కింద  రూ.102.33 కోట్లు అందించాం.జలయజ్ఞం కింద 14 ప్రాజెక్టుల పూర్తి చేయగా వివిధ దశల్లో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయని'' ప్రకటించారు. 

''పేదలకు 29 లక్షల ఇళ్ల స్ధలాలు అందించి నాలుగేళ్లలో రూ.7.5 లక్షల చొప్పున చెల్లించి ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నాం. 43 వేల బెల్ట్ షాపుల తొలగించడమే కాదు 33 శాతం మద్యం షాపులు, 4380 పర్మిట్ రూమ్ ల రద్దు చేశాం. 2020-21 సంవత్సరం నుంచి వైఎస్సార్ చేయూత పథకం అమలు చేయనున్నాం. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చేయూత ద్వారా రూ. 75 వేల సాయం అందిస్తాం. అలాగే 2020-21 నుంచి డ్వాక్రా రుణాల చెల్లింపు కోసం ఏడాదికి రూ. 27,168 కోట్లు కేటాయిస్తాం'' అని వెల్లడించారు. 

''శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీలకు నామినేటెడ్ పనుల్లో  50 శాతం కేటాయింపు వుంటుంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కేటాయింపు వుంటుంది. 41 కొత్త కార్పోరేషన్ల ఏర్పాటుకు సిద్దమయ్యాం'' అని ఈ ఆర్థిక సర్వే ద్వారా వైసిపి ప్రభుత్వం తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu