వైఎస్ వివేకా హత్య కేసుపై తేల్చేసిన డీజీపీ

By Nagaraju penumalaFirst Published May 15, 2019, 3:04 PM IST
Highlights

వివేకా హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ బృందం ఇప్పటికే విచారణ చేపట్టింది. ఆర్థిక లావాదేవీలు, పాతకక్షలు, భూ గొడవలు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటిక వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్తున్నారు. 

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణ ఇంకా కొనసాగుతుందన్నారు. 

అయితే హత్య కేసుపై ఇప్పడే ఏమీ చెప్పలేమని స్పస్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై దాదాపు రెండు నెలలు కావస్తోంది. అయితే హత్యకేసును ఇప్పటికీ పోలీసులు చేధించకపోవడం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

వివేకా హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ బృందం ఇప్పటికే విచారణ చేపట్టింది. ఆర్థిక లావాదేవీలు, పాతకక్షలు, భూ గొడవలు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటిక వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్తున్నారు. 

విచారణకు కుటుంబ సభ్యులు సహకరిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

కేసును చేధించేందుకు 11 బృందాలను నిలయమించారు. ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యత అప్పగించిన విషయం తెలిసిందే. ఇకపోపోతే విశాఖపట్నం కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. మరోవైపు విశాఖలో డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఒక కార్యక్రమం పేరుతో అనుమతి తీసుకుని రేవ్ పార్టీ నిర్వహించారని ఆయన స్పష్టం చేశారు. 

click me!