మీడియా నయీం అంటూ రవిప్రకాశ్‌పై విజయసాయి సెటైర్లు

Siva Kodati |  
Published : May 15, 2019, 01:01 PM IST
మీడియా నయీం అంటూ రవిప్రకాశ్‌పై విజయసాయి సెటైర్లు

సారాంశం

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీవీ9 అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో రవిప్రకాశ్‌పై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్న ఆయన తాజాగా మరోసారి స్పందించారు. 

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీవీ9 అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో రవిప్రకాశ్‌పై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్న ఆయన తాజాగా మరోసారి స్పందించారు.

విజయసాయి ఏమన్నారంటే.. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది! విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్‌ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ‘నకిలీ ప్రవక్త’ రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్‌ దాటేశాడు.

రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో.. పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్‌ చేయవన్న భ్రమలో ఉన్నాడు.

బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్‌. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా ఘాటుగా స్పందించారు.

సొంత పార్టీ నేతలే ఎక్కడికక్కడ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్ళు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక బాబు బిక్క చచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే. సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్‌కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్