ఇండియా-పాకిస్తాన్ కాదు: జలవివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

By narsimha lodeFirst Published Jul 4, 2021, 12:13 PM IST
Highlights

 ఏపీ, తెలంగాణ అంటే  ఇండియా-పాకిస్తాన్ కాదని ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. ఆదివారం నాడు కుటుంబసభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తిరుమల: ఏపీ, తెలంగాణ అంటే  ఇండియా-పాకిస్తాన్ కాదని ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. ఆదివారం నాడు కుటుంబసభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.జలవివాదంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.  రాయలసీమకు నీటిని అందించాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్  ఏపీకి సహకరిస్తామని గతంలో  ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

also read:జల వివాదంపై హైకోర్టుకి ఏపీ రైతులు: తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

 విద్యుత్ ఉత్పాదన కోసం తెలంగాణ అక్రమంగా నీటిని వినియోగించడం దారుణమన్నారు. తెలుగు రాష్ట్రాలలో ప్రజలు తల్లి బిడ్డలా...కలిసి ఉన్నారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఒకరిపై ఒకరికి అభిమానం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని ఆయన  కోరారు. జగన్, కేసీఆర్ మధ్య విభేదాలు తీసుకురావడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

కృష్ణానదిపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు ఆర్డీఎస్ కుడికాలువ పనులను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుండి జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడంపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ విషయమై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది.  ఏపీ  సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు.
 

click me!