మాజీ మంత్రి నారాయణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... హైకోర్టులో సీఐడి కౌంటర్

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 11:53 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి భూకుంభకోణం విషయంలో మాజీ మంత్రి నారాయణను విచారణకు అనుమతి కోరుతూ హైకోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేశారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీఆర్డీఏ మాజీ కమిషనర్ శ్రీధర్ సీఐడీకి కీలక విషయాలు వెల్లడించారు. దీంతో మాజీ మంత్రి విచారణకు అనుమతి కోరుతూ హైకోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేశారు. 

సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ను సీఐడి అధికారులు రెవెన్యూ రికార్డుల మాయంపై విచారించారు. దీంతో 2015లో ల్యాండ్ ఫూలింగ్‌కు ముందే 2014 అక్టోబర్‌లో మంత్రి నారాయణ తుళ్లూరు మండలం రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారన్న శ్రీధర్ వెల్లడించారు. 2015 జనవరిలో ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని... అసైన్డ్ భూముల సేకరణపై జీవో 41 తీసుకొచ్చారన్నారు. ఇదంతా మాజీ మంత్రి నారాయణ పర్యవేక్షణలోనే జరిగిందని శ్రీధర్ తెలిపారు. 

ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977కు విరుద్ధంగా ఉన్న అంశాలను మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లానన్న శ్రీధర్ సీఐడి అధికారులకు తెలిపారు. చట్ట వ్యతిరేకమని ముందే చెప్పినా నారాయణ వినిపించుకోలేదని... ఆయన ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగిందని శ్రీధర్ సీఐడి అధికారులకు తెలిపారు. 

read more  అమరావతి భూముల కేసుపై చంద్రబాబు పిటిషన్: హైకోర్టులో సిఐడి వాదన ఇదీ..

ఇక ఇప్పటికే అమరావతి భూముల కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణను సీఐడి విచారణపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు, నారాయణ విచారణలను మాత్రమే ఆపేయాలంటున్నామని, కేసు దర్యాప్తును సిఐడి కొనసాగించవచ్చునని హైకోర్టు తేల్చి చెప్పింది. 

మార్చి 23వ తేదీన విచారణకు రావాలని ఏపీ సిఐడి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. మార్చి 22వ తేదీన నారాయణను విచారణకు పిలిచింది. దీంతో వీరిద్దరు సిఐడి ఎఫ్ఐఆర్ ను హైకోర్టులో సవాల్ చేశారు. దాంతో వారి విచారణపై కోర్టు స్టే ఇచ్చింది. 

అమరావతి భూముల కేసులో సిఐడి అధికారులు ఇప్పటికే వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని ప్రశ్నించారు. అమరావతి భూముల వ్యవహారంపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణకు కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా సిఐడి కేసులు నమోదు చేసింది. చంద్రబాబు పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ఎ్ససీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా ఉంది. 
 

click me!