చంద్రబాబు తప్ప ఎవరూ ఉండరు: వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం

By telugu teamFirst Published Jan 20, 2020, 9:02 PM IST
Highlights

టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పాలన వీకేంద్రీకరణ బిల్లుపై తన ప్రసంగాన్ని ముగించకపోవడంపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. అందరి కన్నా ఎక్కువ గౌరవం ఇచ్చినా దాన్ని దుర్వినియోగం చేశారని ఆయన చంద్రబాబుపై వ్యాఖ్యానించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలనా వికేంద్రీకరణ బిల్లుపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ముగించకపోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. 50 నిమిషాలు చంద్రబాబుకు సరిపోలేదా అని ఆయన అడిగారు. ప్రజలు నిద్రపోయే దాకా తనకు మాట్లాడేందుకు అవకాశం రాకూడదని ఉద్దేశంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని పొడిగిస్తున్నారని ఆయన అన్నారు. 

చంద్రబాబు ఇంకా ఎంత సేపు మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. రాజధానిపై ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలను చంద్రబాబు చదివి వినిపించే సమయంలో జగన్ అభ్యంతరం చెప్పారు. అంతకు ముందు కూడా జగన్ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించకపోవడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు.

Also Read: విశాఖలో ఆఫీసులు పెడితే డెవలప్‌మెంట్ కాదు: చంద్రబాబు

చంద్రబాబుకు ఇచ్చిన గౌరవం ఎవరికీ ఇవ్వలేదని, ఇంత గౌరవం ఇస్తే దుర్వినియోగం చేస్తున్ారని, అలా దుర్వినియోగం చేసేవాళ్లు చంద్రబాబు తప్ప ఎవరూ ఉండరని ఆయన అన్నారు. ఇంతకన్నా రాక్షసులు ఎవరూ ఉండరని జగన్ వ్యాఖ్యానించారు. 

ఆ స్థితిలో చంద్రబాబుకు ఇంతకు మించి సమయం ఇవ్వడం కుదరదని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శాసనసభలో జరిగిన చర్చకు వైఎస్ జగన్ సమాధానం ఇవ్వడం ప్రారంభించారు. దానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read: ఏపీకి 3 రాజధానులు: ఏ నగరానికి ఏమేమి దక్కుతాయంటే...

టీడీపీ సభ్యుల అభ్యంతరంపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాత్రి 9 గంటల దాకా ముఖ్యమంత్రికి సమయం ఇవ్వలేదని ఆయన అన్నారు. తన ప్రసంగం వినిపించకూడదనే ఉద్దేశంతోనే అల్లరి చేస్తున్నారని ఆయన అన్నారు. రాత్రి 9 గంటలు దాటే దాకా తనకు సమయం ఇవ్వకూడదని చంద్రబాబు అనుకున్నారని ఆయన అన్నారు.

టీడీపి సభ్యులు అడ్డం తగులుతుండడంతో జగన్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. మార్షల్స్ ను పిలిపించి వారిని బయటకు పంపించాలని ఆయన స్పీకర్ ను కోరారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు.

click me!