చిన్నవాడివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా: జగన్ తో చంద్రబాబు

By telugu teamFirst Published Jan 20, 2020, 9:26 PM IST
Highlights

చిన్నవాడివైనా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, మూడు రాజధానులపై పునరాలోచన చేయాలని, తొందర పడవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ తో అన్నారు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాలేదని అన్నారు.

అమరావతి: "చిన్నవాడివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఆలోచించండి. పాలనా వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరగదు. అలా జరిగిన దాఖలాలు లేవు" అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో అన్నారు. ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ రాజధానులను మార్చుకుంటూ పోతే ఎలా అని ఆయన అడిగారు. 

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప పాలన వికేంద్రీకరణ కాదని ఆయన అన్నారు. రాజధానులపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు. ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన సోమవారం రాత్రి మాట్లాడుతూ జగన్ కు ఆ విజ్ఞప్తి చేశారు. 

Also Read: విశాఖలో ఆఫీసులు పెడితే డెవలప్‌మెంట్ కాదు: చంద్రబాబు

తనను విమర్శించడానికే సభలో సమయం కేటాయించారని, తనను విమర్శించినా, ఎగతాళి చేసినా ఫరవా లేదని, ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని, అదే తమ సిద్ధాంతమని ఆయన అన్నారు. శివరామకృష్ణన్ కమిటీలో కూడా ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన లేదని ఆయన చెప్పారు. 

శివరామకృష్ణన్ కమిటీ 46 శాతం విజయవాడ - గుంటూరు ప్రాంతంపై మొగ్గు ప్రదర్శించిందని, తర్వాత విశాక ప్రాంతం వైపు మొగ్గు చూపిందని, విజయవాడ రాజధానిగా ఉండకూడదని చెప్పలేదని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. 

Also Read: ఏపీ అసెంబ్లీలో గందరగోళం: టీడీపీ సభ్యుల సస్పెన్షన్, మార్షల్స్‌తో గెంటివేత

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని... శివరామకృష్ణన్ కమిటీ చెప్పినదానికి, చంద్రబాబు చెప్పినదానికి మధ్య పొంతన లేదని అన్నారు. రాజధాని కేంద్రీకరణ ఉండకూడదని కమిటీ చెప్పినట్లు ఆయన తెలిపారు. 

దానిపై చంద్రబాబు ప్రతిస్పందిస్తూ.. తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే మంత్రి చదివి వినిపించారని, నివేదికలో కమిటీ చివరలో ఏం చెప్పిందనేది ముఖ్యమని అన్నారు. 

రాజధానిగా అమరావతిని అపేశారని, పెట్టుబడులు తరలిపోతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగిందని, చిన్నవాడైనా ముఖ్యమంత్రికి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, పునరాలోచన చేయాలని, తొందరపడవద్దని ఆయన అన్నారు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా ఫలితాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. 

click me!