మా పనులనే చేయరా... సచివాలయ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన వైసీపీ నేత

Siva Kodati |  
Published : Sep 05, 2020, 05:39 PM IST
మా పనులనే చేయరా... సచివాలయ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన వైసీపీ నేత

సారాంశం

కర్నూలు జిల్లా ఆదోని మండలం మండగిరి గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నేత ఒకరు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన కల్లుబోతు సురేశ్‌ శనివారం కార్యాలయంలోకి వెళ్లి.. ఉద్యోగులను ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో దూషించాడు.

మా పనులే చేయరా అంటూ నానా హంగామా సృష్టించాడు. అక్కడితో ఆగకుండా నరేంద్ర అనే అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ చెంప చెల్లు మనిపించాడు. "నేను వైసీపీ లీడర్‌"ను అంటూ... వీరంగం సృష్టించిన సురేశ్, ఆఫీసులోని కుర్చీని విరిసేరి హల్‌‌చల్ చేశాడు.

వైసీపీ నేత కల్లోబోతు సురేశ్‌ చేసిన వీరంగంపై ఉద్యోగులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మండిగిరిలోని వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకుని సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు.

ఏవోను బెదిరించి.. రాజీ చేసుకున్నట్టు లేఖ రాయించుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు... తాము చేసిన తప్పేంటని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఆఫీసులోకి చొరబడి దాడికి దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు.

సురేశ్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులపై దౌర్జాన్యానికి దిగే వారిపై చర్యలు తీసుకోకపోతే తమ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?