ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

By Nagaraju penumalaFirst Published Aug 15, 2019, 9:31 AM IST
Highlights

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మువ్వన్నెల జెండాను జగన్ ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు సీఎం జగన్. అనంతరం ఓపెన్ టాప్ పై అధికారులకు, ప్రజలకు అభివాదం చేశారు సీఎం జగన్. 

అమరావతి: 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మువ్వన్నెల జెండాను జగన్ ఎగురవేశారు. 

అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు సీఎం జగన్. అనంతరం ఓపెన్ టాప్ పై అధికారులకు, ప్రజలకు అభివాదం చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా రరాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

స్వాతంత్య్ర దినోత్సవ వేడులకలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేశారు.

ఇండిపెండెన్స్ డే: సీఎంగా తొలిసారి జగన్
 

click me!