పీఆర్సీ‌పై పీటముడి: రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ,రేపైనా తేలేనా?

Published : Jan 05, 2022, 11:26 AM ISTUpdated : Jan 05, 2022, 11:37 AM IST
పీఆర్సీ‌పై పీటముడి: రేపు ఉద్యోగ సంఘాలతో  సీఎం జగన్ భేటీ,రేపైనా తేలేనా?

సారాంశం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్ మెంట్ పై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం వైఎస్ జగన్ ఈ నెల 6న ఏపీకి చెందిన ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు.

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకుPrc ఫిట్‌మెంట్ పై కసరత్తు తుది దశకు చేరుకుంది. పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ఏపీ  సీఎం Ys Jagan ఈ నెల 6వ తేదీన ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

AP Employees  సంఘాలతో సమావేశం వివరాలను ఇవాళ ఆర్ధిక శాఖ ప్రతినిధులు సీఎం జగన్ కు వివరించనున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను కూడా ఆర్ధిక శాఖ ప్రతినిధులు సీఎంకు వివరించనున్నారు.  అయితే సీఎంతో జరిగే సమావేశంలోనే పీఆర్సీపై తాడో పేడో తేల్చుకోవాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. ఉద్యోగ సంఘాలకు ఉదారంగా పీఆర్సీని ఖరారు చేసేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని కూడా ప్రభుత్వ వర్గాల నుండి సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ మేరకు రాస్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి సహకరించడం లేదని కూడా ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ సంఘాల నేతల దృష్టికి తీసుకొచ్చారు. 

సుమారు నెల రోజుల నుండి పీఆర్సీ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు సాగుతున్నాయి. కానీ పీఆర్సీ  విషయమై ఇంకా స్పష్టత రాలేదు. రాస్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు sajjala Ramakrishna Reddy, ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana rajendranath reddy ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్ విషయమై  కార్యదర్శుల కమిటీ ఇచ్చిన 14.29 ఫిట్‌మెంట్ ను తాము అంగీకరించబోమని  ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు..

also read:పీఆర్సీపై పీటముడి: ఉద్యమానికి సిద్దమౌతున్న ఉద్యోగ సంఘాలు

27 శాతానికి పైగా ఫిట్‌మెంట్ ఉంటేనే చర్చలకు వస్తామని కూడా సీఎస్   Sameer Sharma కు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పీఆర్సీ విషయమై స్పష్టత రాని  నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుండి ఆందోళన కార్యక్రమాలను నిర్ణయించే అవకాశం ఉంది. చర్చల పేరుతో పిలిచి తమను అవమానపరుస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. 

పీఆర్సీ ఫిట్‌మెంట్ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టత కావాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ప్రస్తుతం తాము తీసుకొంటున్న వేతనాల కంటే తక్కువ పిట్‌మెంట్ ఉంటే అంగీకరించబోమని కూడా ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. పీఆర్సీపై ప్రభుత్వం కసరత్తును ప్రారంభించి దాదాపుగా నెల రోజులు అవుతుంది. అయితే పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో సీఎంతో జరిగే సమావేశంలోనైనా పీఆర్సీపై స్పష్టత వస్తోందనే ఆశాభావంతో ఉద్యోగ సంఘాలు ఉన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తిరుపతిలో జగన్ పర్యటించిన సమయంలో  పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాల నేతలు దృష్టికి తీసుకొచ్చారు. పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమైంది, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత పీఆర్సీపై నిపుణుల కమిటీ నివేదికను సీఎంకు ఇచ్చారు. అయితే పీఆర్సీపై నిపుణుల కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ ను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించడం లేదు. 
 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు