అమరావతిపై జగన్ సర్కార్ ఫోకస్... మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుదిశగా మరో ముందడుగు

By Arun Kumar PFirst Published Jan 5, 2022, 10:35 AM IST
Highlights

అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుకు సిద్దమైన జగన్ సర్కార్ ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని గ్రామాల్లో గ్రామసభల ఏర్పాటుద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు సిద్దమైంది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి (amaravati) పరిధిలోకి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు వైసిపి సర్కార్ సిద్దమైంది. అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (amaravati capital city municipal carporation) ఏర్పాటుకు ఇటీవల జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమరావతి పరిధిలోని 19 గ్రామాలను కలుపుకుని నగరపాలక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఇటీవలే నోటిఫికేషన్ కూడా విడుదల చేసారు. ఈ క్రమంలోనే కార్పోరేషన్ పరిధిలోకి వచ్చే గ్రామాల  ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. 

ఇవాళ్టి(బుధవారం) నుండి వారంరోజుల పాటు అమరావతి నగరపాలక సంస్థ  ఏర్పాటుకు ప్రతిపాదించిన గ్రామాల్లో గ్రామసభలు జరగనున్నాయి. ఈరోజు కురగల్లు (kuragallu), నీరుకొండ (neerukonda) గ్రామాల్లోగ్రామసభ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు అధికారులు. ముందుగా  ప్రభుత్వ ప్రతిపాదనను గ్రామస్తులకు తెలిపి వారి అభిప్రాయాలను సేకరించడమే కాదు అభ్యంతరాలను కూడా అధికారులు నమోదు చేసుకోనున్నారు.    

Latest Videos

మంగళగిరి (mangalagiri) మండలంలో 3 గ్రామాలు,తుళ్లూరు మండలంలో 16 గ్రామాలను కలిపి అమరావతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి నగరపాలక సంస్ధ ఏర్పాటుపై అభిప్రాయాలను సేకరించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

read more  రాజధాని వికేంద్రీకరణ తథ్యం.. అమరావతి కూడా వుంటుంది: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

అయితే కేవలం 19గ్రామాలతోనే అమరావతి నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని మిగతా రాజధాని గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను కలిపి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజధాని గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పోలీస్ బందోబస్తు మధ్య సాగనుంది. గ్రామసభలు ఏ గ్రామంలో ఎప్పుడు నిర్వహించనున్నారో ముందుగానే ప్రకటించి ఆయా గ్రామాల ప్రజలకు ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, గ్రామ పంచాయితీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో నోటీసులను అంటిస్తారు.  

గ్రామ సభలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించే వారినుండే కాదు వ్యతిరేకించే వారినుండి అభిప్రాయాలను సేకరిస్తారు. తీర్మానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన అభిప్రాయాలను అధికారులు విడివిడిగా నమోదు చేసుకుంటారు. 

read more  రాజకీయాల్లో సమూల మార్పులకు ప్రయత్నిద్దాం: దళిత, బీసీ, కాపులకు ముద్రగడ లేఖ

గతంలోనే అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం సిద్దమైంది. అయితే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. తాజాగా మళ్ళీ రాజధాని గ్రామాల్లో అభిప్రాయ సేకరణకు సిద్దమైంది. 

గతేడాది డిసెంబర్ 16న గుంటూరు జిల్లా కలెక్టర్ కు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని పంచాయితీరాజ్ కమీషనర్ నుండి ఆదేశాలు అందాయి. దీంతో కలెక్టర్ మంగళగిరి,తుళ్లూరు ఎంపిడిఓ, పంచాయితీరాజ్ అధికారులకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఇవాళ్టి నుండి వారంరోజుల పాటు 19 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేసారు. 
 

click me!