
గుంటూరు: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన ప్రజాప్రతినిధి బెదిరింపులకు భయపడి ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా (guntur district) సత్తెనపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇద్దరు యువకులు ప్రాణాపాయ స్థితిలో ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
బాధిత యువకుల కుటుంబసభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సత్తెన్నపల్లి (sattenapalli) 22వ వార్డు కౌన్సిలర్ గా వైసిపికి చెందిన శెట్టి ఆనంద్ కొనసాగుతున్నారు. అయితే అదే వార్డుకు చెందిన యువకులు శివశంకర్, గోపి చెప్పినమాట వినడకపోవడంతో కౌన్సిలర్ వారిని బెదిరించారు.
Video
ఇలా కౌన్సిలర్ ఆనంద్ బెదిరింపులతో యువకులు భయపడిపోయిన దారుణ నిర్ణయం తీసుకున్నారు. యువకులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయిన శివశంకర్, గోపి లను కుంటుంబసభ్యులు, స్నేహితులు సత్తెనపల్లి ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లారు.
read more పెళ్లి చేసుకుంటానని సచివాలయంలో పనిచేసే యువతికి శారీరకంగా దగ్గరైన కానిస్టేబుల్.. కానీ చివరకు..
ప్రస్తుతం యువకులిద్దరికి చికిత్స కొనసాగుతున్నట్లు హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా వున్నట్లు సమాచారం. తన బిడ్డల పరిస్థితిని చూసి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కు వెళ్లి యువకుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. తమ పిల్లల ఈ పరిస్థితికి కారణమైన కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు.