గవర్నర్‌తో భేటీకానున్న జగన్: అసెంబ్లీ సమావేశాలతో పాటు కీలకాంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Oct 28, 2021, 5:56 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ సీఎం జగన్ గురువారం నాడు భేటీ కానున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పట్టాభి ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై జగన్ గవర్నర్ చర్చించే అవకాశం ఉంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ Biswabhusan Harichandanతో ఏపీ సీఎం Ys Jaganగురువారం నాడు  భేటీ కానున్నారు.  టీడీపీ అధికార ప్రతినిధి Pattabhiచేసిన వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ తో జగన్ చర్చించే అవకాశం ఉంది.

also read:టీడీపీ గుర్తింపు రద్దు చేయండి.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు, అది తెలుగు దొంగల పార్టీ అన్న విజయసాయి

వచ్చే నెల 17వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని  ఇవాళ జరిగిన AP Cabinetసమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. గవర్నర్ తో భేటీలో ఈ అంశాన్ని జగన్ గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు  నవంబర్ 1వ తేదీన Ysr లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో పాటు వైఎస్ఆర్ అవార్డును ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డును ప్రతి ఏటా నవంబర్ 1 వ తేదీన ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ ఏడాది నవంబర్ 1 వ తేదీన తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి గవర్నర్ ను ఆహ్వానించనున్నారు సీఎం జగన్.  

పట్టాభి ఎపిసోడ్, టీడీపీ చీఫ్ Chandrababu Naidu ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ తో  భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి బూతు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ Tdp కార్యాలయంపై Ycp శ్రేణులు దాడికి దిగారు. ఈ దాడులను నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు 36 గంటల పాటు దీక్షకు దిగాడు.మరో వైపు జగన్ పై బూతు వ్యాఖ్యలు చేసిన పట్టాభి సహా చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ నేతలు రెండు రోజుల పాటు జనాగ్రహ దీక్షలకు దిగారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో హీట్ ను పెంచింది.

 జగన్ పై బూతు వ్యాఖ్యలు చేసిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పట్టాభికి కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన కుటుంబసభ్యులతో  ప్రశాంతత కోసం విజయవాడ వదిలి వెళ్లారు.

మరో వైపు చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కలిసి రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. మరోవైపు 356 ఆర్టికల్ ను ప్రయోగించాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం కూడా ఆయన ప్రయత్నించారు. అయితే జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్  మెంట్ లభించలేదు. మంగళవారం నాడు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ నుండి  హైద్రాబాద్ కు తిరిగి వచ్చాడు. అయితే బుధవారం నాడు కేంద్ర మంత్రి amit Shah షా టీడీపీ చీప్ చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను చంద్రబాబు ఈ సందర్భంగా అమిత్ షాకు వివరించారు.

రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై అమిత్ షాకు వినతి పత్రం పంపుతామని చంద్రబాబు చెప్పారు. మరో వైపు ఇవాళ ఢీల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో టీడీపీ, వైసీపీ ఎంపీలు పోటా పోటీగా అమిత్ షా ను కలిశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. తమ పార్టీ నేతలు, కార్యాలయాలపై దాడులకు దిగి తమ వారిపైనే కేసులు నమోదు చేశారని అమిత్ షాకు టీడీపీ నేతలు వివరించారు.

click me!