ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులను టీడీపీ (tdp) నేతలు అసభ్యకరంగా దూషించడం అనాగరికమైన చర్య అన్నారు వైసీపీ (ysrcp) ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (vijaya sai reddy) . టీడీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీల బృందం గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (election commission) కలిసింది.
ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులను టీడీపీ (tdp) నేతలు అసభ్యకరంగా దూషించడం అనాగరికమైన చర్య అన్నారు వైసీపీ (ysrcp) ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి (vijaya sai reddy) . టీడీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీల బృందం గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని (election commission) కలిసింది. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చట్టబద్ధంగా వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ (telugu desam party) అంటే తెలుగు దొంగల పార్టీ అంటూ ఆయన అభివర్ణించారు. ఏపీ శాసన మండలిలో 14 స్థానాలు ఖాళీగా వున్నాయని.. వాటిలో 14 స్థానాలు స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడ్డ వారు ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారని విజయసాయి చెప్పారు. మూడు స్థానాలు ఎమ్మెల్యే కోటాలో వున్నాయన్నారు. దీనికి ఎన్నికల సంఘం కమీషనర్లు సానుకూలంగా స్పందించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీని ఎన్నికలకు అనుమతిస్తే.. దొంగలు, రౌడీలు ఎన్నికవుతారని ఆయన దుయ్యబట్టారు.
అంతకుముందు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు టీడీపీ, వైసీపీ (ysrcp) ఎంపీలు. పార్లమెంట్ లాబీలో అమిత్ షాను కలిసిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (kanakamedala ravindra kumar).. ఏపీలో అధికార వైసీపీ దాడులు చేస్తోందంటూ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పరిస్ధితులపై అమిత్ షాకు వివరించారు కనకమేడల. తక్షణం కేంద్రం కల్పించుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. హోం వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కన్సల్టెటీవ్ ఛైర్మన్ అమిత్ షా నేతృత్వంలో గురువారం సమావేశం జరిగింది. కమిటీలో సభ్యులుగా వున్న టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌లు (gorantla madhav) అమిత్ షాను కలిశారు. సమావేశం తర్వాత రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలపై అమిత్ షాకు పోటాపోటీగా ఫిర్యాదు చేశారు కనకమేడల, గోరంట్ల.
undefined
కాగా.. బుధవారం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడికి కేంద్ర హోంశాఖ మంత్రి amit shah ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న Chandrababuకు అమిత్ షా అపాయింట్ మెంట్ దక్కలేదు. దీంతో మంగళవారం నాడు సాయంత్రం బాబు ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు చేరుకొన్నారు. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసినట్టుగా టీడీపీ వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలతో కలవడం సాధ్యం కాలేదని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోని Tdp కార్యాలయాలపై దాడులు, ఇతరత్రా అంశాలను చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అమిత్ షా కు వివరించారు.
రాష్ట్రంలో Ganja, Drugs కు సంబంధించిన అంశాలను చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలపై ప్రశ్నించినందుకు తమ పార్టీ కార్యాలయాలపై దాడులు నిర్వహించారని ఆయన చెప్పారు. తమ పార్టీకి చెందిన నేతలపై దాడులు చేస్తూ తమవారిపైనే కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలపై రూపొందించిన వినతిపత్రాన్ని పంపుతామని బాబు అమిత్ షా కు తెలిపారు. ఈ విషయాలను వివరించేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే జమ్మూ కాశ్మీర్ పర్యటనలో అమిత్ షా బిజీగా వుండటంతో బాబుకు ఆయనను కలవడం సాధ్యం కాలేదు. రాష్ట్రంలో 356 ఆర్టికల్ ప్రయోగించాలని డిమాండ్ చేశారు.ఇదే విషయమై రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించారు. ఆర్టికల్ 356 కు టీడీపీ వ్యతిరేకం. అయితే ఈ ఆర్టికల్ ను ప్రయోగించాలని తాము కోరుతున్నామంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని చంద్రబాబు చెబుతున్నారు. అనివార్య పరిస్థితుల్లోనే ఈ ఆర్టికల్ ను ప్రయోగించాలని తాము కేంద్రాన్ని కోరుతున్నామని కూడ మీడియాకు చెప్పారు.