అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట: రేపటి నుంచి చెల్లింపులు.. జగన్ సర్కార్ నిర్ణయం

By Siva Kodati  |  First Published Nov 6, 2019, 5:15 PM IST

అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. గురువారం గుంటూరులో సీఎం జగన్ చేతుల మీదుగా బాధితులకు చెక్కులు అందజేయనున్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేస్తారు. 


అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. గురువారం గుంటూరులో సీఎం జగన్ చేతుల మీదుగా బాధితులకు చెక్కులు అందజేయనున్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేస్తారు.

తొలి కేబినెట్ సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి బడ్జెట్‌లో రూ.1,151 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా గత నెల 18న రూ.263 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3,69,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించనుంది. 

Latest Videos

undefined

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చర్యలు చేపట్టింది. బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రూ.1150 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలోంచి తాజాగా రూ.269.99 కోట్లు మంజూరు చేశారు. 

Also Read:అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త...ఎన్నికల హామీల అమల్లో జగన్ మరో ముందడుగు

ఇప్పటికే రూ.10వేల లోపు డిపాజిటర్ల వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. గుంటూరు జిల్లాలో 19,751 బాధితులకు రూ. 14,09,41,615లు, చిత్తూరుకు జిల్లాలో 8,257 మందికి రూ. 5,81,17,100 తూర్పుగోదావరి జిల్లాలో 19,545 మందికి  రూ. 11,46,87,619, పశ్చిమగోదావరి జిల్లాలో 35,496 మందికి రూ. 23,05,98,695, విజయనగరం జిల్లాలో 57,941 మంది బాధితులకు  రూ. 36,97,96,900, శ్రీకాకుళం జిల్లాలో 45,833 మందికి రూ. 1,41,59,741 మంది వున్నారు. 

అలాగే కర్నూలు జిల్లాలో 15,705 మందికి రూ. 11,14,83,494, నెల్లూరు జిల్లాలో 24,390 మందికి రూ. 16,91,74,466, కృష్ణా జిల్లాలో 21,444 మందికి రూ. 15,04,77,760, అనంతపురం జిల్లాలో 23,838 మందికి రూ. 20,64,21,009, వైయస్సార్‌ కడప జిల్లాలో 18,864 మందికి రూ. 13,18,06,875, ప్రకాశం జిల్లాలో 26,586 మందికిరూ. 19,11,50,904,  విశాఖపట్నం జిల్లాలో 52,005 మందికి రూ. 45,10,85,805  రూపాయలను తొలివిడతలో చెల్లించనున్నారు. మొత్తమ్మీద 3,69,655 మందికి రూ.263.99 కోట్లు చెల్లించనున్నారు.

Also Read:అగ్రిగోల్డ్ బాధితులకు అండ... జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి జిల్లాలోను అగ్రిగోల్డ్‌ బాధితులు వైఎస్‌.జగన్‌ను కలుసుకుని తమ ఆవేదను వ్యక్తం చేశారు. కూలిపనులు చేసుకున్నవారు, చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాన్ని నడుపుకుంటున్నవారు, మధ్యతరగతి ప్రజలు చాలామంది డబ్బు ఇప్పించాలని కోరారు. 

దీంతో రూ.20వేలలోపు డిపాజిట్‌ చేసిన బాధితులందరికీ ప్రభుత్వం తరఫునే చెల్లిస్తామని... ఈమేరకు రూ.1150 కోట్లు ఇస్తామని వైఎస్‌.జగన్‌ అగ్రిగోల్డ్‌ బాధితులకు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చారు. ఆ హామీ అమల్లో భాగంగా తొలి అడుగు వేస్తూ తొలి విడతలో రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించనున్నారు.

click me!