చింతమనేని ప్రభాకర్ 54 నాటౌట్: వరుస కేసులతో జైల్లోనే.....

By Nagaraju penumalaFirst Published Nov 6, 2019, 3:58 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ వరుస దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండేవారు చింతమనేని ప్రభాకర్. అప్పటికే కేసులు నమోదు అయినప్పటికీ పెద్దగా బయటకు రాలేదు. 
 

విజయవాడ: వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసులు మీద కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. 

పశ్చిమగోదావరి జిల్లాలో రెబల్ నేతగా పేర్గాంచిన చింతమనేని ప్రభాకర్ ఇసుక మాఫియా నేపథ్యంలో మహిళా తహాశీల్దార్ వనజాక్షిపై దాడికి పాల్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా హల్ చల్ చేశారు. నిండు అసెంబ్లీలో చింతమనేని ప్రభాకర్ పైనే రోజుల తరబడి చర్చ జరిగింది. 

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ వరుస దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండేవారు చింతమనేని ప్రభాకర్. అప్పటికే కేసులు నమోదు అయినప్పటికీ పెద్దగా బయటకు రాలేదు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో చింతమనేనిపై కేసుల పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు 50 కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని ప్రభాకర్ పై తాజాగా మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. 
  
దెందులూరు నియోజకవర్గం పరిధిలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు పోలీస్ స్టేషన్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. మెుత్తానికి ఇప్పటి వరకు చింతమనేని ప్రభాకర్ పై ఉన్న కేసులు సంఖ్య 54కు చేరుకుంది. 

ప్రస్తుతం 50కి పైగా కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని ప్రభాకర్ కు కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ మరికొన్ని కేసుల్లో బెయిల్ మాత్రం రాలేదు. దాంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.  

పీటీ వారెంట్‌పై చింతమనేనిని పోలీసులు ఏలూరు జిల్లా జైలు నుంచి కోర్టులో బుధవారం కోర్టులో హాజరుపరిచారు. అయితే నవంబర్ 20వ తేదీ వరకు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే పలు పాత కేసుల్లో ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించినట్లు తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

చింతమనేని మానభంగం చేశాడా, మీలా బాబాయిని చంపాడా...?: సీఎం జగన్ పై చంద్రబాబు

జైల్లో చింతమనేనిని పరామర్శించిన నారా లోకేష్

click me!