సీఎస్‌గా నీలం సహాని వైపు జగన్ మొగ్గు: కేంద్రం చేతుల్లోనే

Published : Nov 06, 2019, 05:00 PM ISTUpdated : Nov 06, 2019, 06:23 PM IST
సీఎస్‌గా నీలం సహాని వైపు జగన్ మొగ్గు: కేంద్రం చేతుల్లోనే

సారాంశం

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానిని నియమించుకొనేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. కేంద్రం క్లియరెన్స్ ఇస్తే రాష్ట్రం సీఎస్ గా నియమించుకొనే అవకాశం ఉందంటున్నారు. 

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని వైపు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. అయితే నీలం సహాని ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కేంద్రం నుండి క్లియరెన్స్ రాగానే  నీలం సహానిని నియమించుకోవాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నట్టుగా సమాచారం.

Also read:సీఎస్‌గా నీలం సహాని వైపు జగన్ మొగ్గు: కేంద్రం చేతుల్లోనే

నీలం సహాని 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. సమీర్ శర్మ 1985 బ్యాచ్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. నీలం సహాని 2020 జూన్ 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ ఇద్దరు అధికారుల్లో నీలం సహాని వైపే వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో  కలెక్టర్‌గా నీలం సహాని పనిచేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా సహాని సుదీర్ఘకాలం పనిచేశారు. ఏపీ రాష్ట్రంలో వైద్య,ఆరోగ్య  శాఖతో పాటు పలు కీలకమైన శాఖల్లో నీలం సహాని పనిచేశారు. 

Also Read:ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ: జగన్‌కు భవిష్యత్తు ముప్పు?

పరిపాలనలో సహానికి మంచి పట్టుంది. దీంతో ఏపీ రాష్ట్రానికి సీఎస్ గా తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. దీంతో నీలం సహానిని సీఎస్ గా నియమించుకొనే విషయమై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టుగా సమాచారం. కేంద్రం నుండి క్లియరెన్స్ రాగానే నీలం సహానిని సీఎస్ గా నియమించుకొనే అవకాశం ఉందని ఏపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Also Read:ఇన్‌ఛార్జ్ సీఎస్‌గా నీరభ్ కుమార్ బాధ్యతలు: రిలీవ్ అయిన ఎల్వీ

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం నాడు సీసీఎల్ఏ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలను  ఇంచార్జీ సీఎస్ గా ప్రభుత్వం నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల మేరకు ఇంచార్జీ సీఎస్ నీరబ్ కుమార్ కు ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం నాడు ఉదయం బాధ్యతలను అప్పగించారు.  ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్ల హెచ్‌ఆర్‌డి ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. అయితే బాపట్ల హెచ్ఆర్‌డి డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు తీసుకోకుండానే  ఎల్వీ సుబ్రమణ్యం సెలవులో వెళ్లారు.

ఏపీ రాష్ట్రానికి ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సహానిని నియమించుకోవాలని  ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ ఐఎఎస్ అధికారుల్లో   నీలం సహానిని ఏపీ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవాలని  భావిస్తున్నట్టుగా సమాచారం.ఏపీకి నీలం సహాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu