సీట్ల కోసం కొట్టుకుంటే.. బడ్జెట్‌పై చర్చ ఎప్పుడు: జగన్

Siva Kodati |  
Published : Jul 17, 2019, 11:04 AM ISTUpdated : Jul 17, 2019, 11:15 AM IST
సీట్ల కోసం కొట్టుకుంటే.. బడ్జెట్‌పై చర్చ ఎప్పుడు: జగన్

సారాంశం

ప్రతిపక్ష సభ్యులు విలువైన కాలాన్ని వృథా చేస్తుున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్..టీడీపీ సభ్యులు సీట్ల కేటాయింపుపై అనవరంగా రాద్ధాంతం చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు

అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన జీరో అవర్ ఇంతవరకు పూర్తికాలేదని.. కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చామని .. బడ్జెట్‌పై ఎప్పుడు చర్చ జరగాలని ఆయన ప్రశ్నించారు.

సీట్లెక్కడ ఉండాలి...  ఎవరి పక్కన కూర్చోవాలంటూ ప్రతిపక్ష సభ్యులు సమయాన్ని వృథా చేస్తోందంటూ జగన్ మండిపడ్డారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు లావుగా, పొడుగ్గా ఉన్నారనే అన్నాము తప్పించి ఎటువంటి అసభ్యపదజాలాన్ని వినియోగించలేదన్నారు. 

డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన అధికార పక్షం నిబంధనలను అనుసరించే అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని తెలిపింది. సభా సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు కోరడంతో.. తనను ఎవరు బెదిరించలేరని స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: రాష్ట్ర అభివృద్ధికి అధికారులకి సీఎం ఫుల్ పవర్స్ | Asianet News Telugu
CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu