అనుభవమంతా దోచుకోవడానికే... చంద్రబాబుపై మంత్రి అనిల్ విమర్శలు

Published : Jul 17, 2019, 10:19 AM ISTUpdated : Jul 17, 2019, 10:49 AM IST
అనుభవమంతా దోచుకోవడానికే... చంద్రబాబుపై మంత్రి అనిల్ విమర్శలు

సారాంశం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రింగ్ గా మారి రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు పంచుకున్నారని మంత్రి అనిల్ అన్నారు. 


ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం సాగునీటి ప్రాజెక్టులపై సభలో చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలో... ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు అనుభవమంతా దోచుకోవడానికే పనిచేసిందని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రింగ్ గా మారి రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు పంచుకున్నారని మంత్రి అనిల్ అన్నారు. అదేవిధంగా రూ.16వేల కోట్ల మేర రేట్లు పెంచేశారని ఆరోపించారు.

శిలాఫలకాల కోసమే కోట్లు ఖర్చు చేశారని.. ప్రజెక్టు పూర్తి చేద్దామన్న ధ్యాస చంద్రబాబులో లేదని మండిపడ్డారు. ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ తెస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టుల్లో పారదర్శకతకు జ్యూడిషియల్ కమిషన్ వేస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా... అసెంబ్లీ సమావేశంలో సీట్ల కేటాయింపులో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య రగడ కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్