బ్రహ్మంగారి పీఠం మఠాధిపతి నియామకం: హైకోర్టును ఆశ్రయించిన మహాలక్ష్మమ్మ

By narsimha lodeFirst Published Jun 30, 2021, 11:55 AM IST
Highlights

జిల్లాలోని బ్రహ్మంగారి పీఠం మఠాధిపతి వ్యవహరం మళ్లీ మొదటికొచ్చింది. మఠాధిపతి నియామకాన్ని నిలిపివేయాలని కోరుతూ వీరభోగవెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

కడప: జిల్లాలోని బ్రహ్మంగారి పీఠం మఠాధిపతి వ్యవహరం మళ్లీ మొదటికొచ్చింది. మఠాధిపతి నియామకాన్ని నిలిపివేయాలని కోరుతూ వీరభోగవెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

మఠాధిపతి నియామకం విషయంలో కుటుంబసభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఇటీవల కుదిరింది. దీంతో వీరభోగవెంకటేశ్వరస్వామి మొదటి భార్య పెద్ద కొడుకు వెంకటాద్రిని మఠాధిపతిగా,రెండో కొడుకు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా నియమించాలని కుటుంబసభ్యుల మధ్య అంగీకారం కుదిరింది.  రెండో భార్య మహాలక్ష్మమ్మ కొడుకులను  భవిష్యత్తులో మఠాధిపతులుగా నియమించాలని నిర్ణయించారు.

also read:వీడిన ‘‘పీఠ’ముడి: బ్రహ్మంగారి మఠం ‘‘ వెంకటాద్రి’’దే

 ఈ విషయమై తమ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని  గత వారంలో  కుటుంబసభ్యులు ప్రకటించారు.ఇవాళ బ్రహ్మంగారిపీఠం మఠాధిపతిగా వెంకటాద్రి ప్రమాణం చేసే అవకాశం ఉంది.ఈ సమయంలోనే వెంకటాద్రి మఠాధిపతిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ మహలక్ష్మమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

మహాలక్ష్మమ్మపై కందిమల్లాయపల్లె గ్రామస్తుల ఫిర్యాదు

 వీరభోగ వెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మపై కందిమల్లాయపల్లె గ్రామస్థులు పోలీసులకు పిర్యాదు చేశారు. తన బంధువులకు ఆనారోగ్యంగా ఉందనే కారణంతో ఆమె గ్రామం విడిచి వెళ్లింది. అయితే బంగారం, నగదును తీసుకొని వెళ్లిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహాలక్ష్మమ్మపై  కేసు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

click me!