ఆన్‌లైన్ జూదంపై ఎందుకు నిషేధం విధించలేదు: బాబును ప్రశ్నించిన జగన్

By narsimha lodeFirst Published Dec 1, 2020, 2:15 PM IST
Highlights

ఆన్‌లైన్ గురించి గొప్పలు చెప్పుకొనే టీడీపీ.... తమ హాయంలో ఆన్ లైన్ జూదాన్ని ఎందుకు నిషేధించలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.

అమరావతి:ఆన్‌లైన్ గురించి గొప్పలు చెప్పుకొనే టీడీపీ.... తమ హాయంలో ఆన్ లైన్ జూదాన్ని ఎందుకు నిషేధించలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.

మంగళవారం నాడు  ఏపీ అసెంబ్లీలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.ఇటువంటి చట్టం ఒకటి తీసుకురావాలి.. ఆన్ లైన్ జూదాన్ని ఆపాలనే విధంగా ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు.

ఆన్ లైన్ జూదాన్ని నిషేధిస్తూ తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తుందన్నారు. ఆన్ లైన్ లో జూదం ఆడుతూ యువత నష్టపోతున్నారని ఆయన చెప్పారు. చాలా మంది ఈ  జూదం కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

also read:ఏపీ అసెంబ్లీ: నిమ్మల రామానాయుడు ఒక్క రోజు సస్పెన్షన్

ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని ఆన్ లైన్ జూదాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.గత ఐదేళ్లలో ఆన్ లైన్ జూదం గురించి టీడీపీ సర్కార్ పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు.ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే  రాజకీయాలు చేయడం సరైందికాదని చెప్పారు.ఆన్ లైన్ జూదంతో పాటు ఆఫ్‌లైన్ జూదంపై  కూడ నిషేధం విధించాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు.

click me!