టిడ్కోపై చర్చ జరగకూడదనే సభలో కుట్ర.. సీఎం జగన్‌ ఆగ్రహం

Bukka Sumabala   | Asianet News
Published : Dec 01, 2020, 12:22 PM IST
టిడ్కోపై చర్చ జరగకూడదనే సభలో కుట్ర.. సీఎం జగన్‌ ఆగ్రహం

సారాంశం

ప్రతిపక్ష టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రతిపక్ష టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు విపక్ష సభ్యులు పదేపదే సభకు అంతరాయం కలిగిస్తున్నాయని, ప్రజా సమస్యలపై కనీస అవగహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని సభలో మండిపడ్డారు. కనీస అంశాలపై చర్చించకుండా అసలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థంకావడంలేదని అన్నారు. ఓవైపు సీఎం ప్రసంగం సాగుతున్నా.. అదిప్రజలకు చేరవద్దనే కట్రతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 శాసనసభలో సీఎం ప్రంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. అనవసరమైన అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. అసెంబ్లీ శీతకాల సమావేశాల్లో భాగంగా రెండోరోజు సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. 

‘సభ్యుల మాటలు వినకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోంది. డిసెంబర్‌ 15న రూ.1227 కోట్ల బీమా చెల్లిస్తున్నాం. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే బీమా చెల్లింపులను చర్చించాం. కేబినెట్‌లోనూ ఆమోదించాం. డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. జగన్‌ ఒక మాట చెబితే.. ఆ మాట నిలబెట్టుకుంటాడని ప్రజల్లో విశ్వాసం ఉంది. చంద్రబాబుకు మోసం చేయడమే తెలుసు. 

టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావు. తాను ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతాం. ఆ విధమైన నమ్మకం ప్రజల్లో ఎప్పుడో కలిగింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఓ నమ్మకాన్ని కలిగించాం. దటీజ్‌ జగన్‌. చంద్రబాబు ఏదైనా చెప్పాడు అంటే అది చేయడు అనేది క్రెడిబులిటీ. మనం చేసే పనుల వళ్ల మనకు క్రెడిబులిటీ వస్తుంది. చంద్రబాబు హయాంలో ఇన్సూరెన్స్‌ కట్టాలంటే రైతులు భయపడేవారన్నారు. 

మరోవైపు సభలో టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. కనీసం ఆయన మాటాలను పట్టించుకోలేదు. సభ సజావుగా సాగేందుకు టీడీపీ సభ్యులు సహకరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోలేదు. దీంతో టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడును ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

Rammohan Naidu Speech: రామ్మోహన్ నాయుడు పంచ్ లకి పడి పడి నవ్విన చంద్రబాబు, లోకేష్| Asianet Telugu
CM Chandrababu Naidu Speech: దావోస్‌ పర్యటనలో జగన్ పై చంద్రబాబు పంచ్ లు| Asianet News Telugu