పుంగనూరులో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ ఘర్షణలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. అనుమతి లేని రూట్ లోకి వెళ్లి ఘర్షణకు చంద్రబాబు కారణమయ్యారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు
అమలాపురం: మొన్నటి పుంగనూరు ఘటన చూస్తే చాలా బాధనిపిస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు. ఒక రూట్ లో అనుమతి తీసుకొని మరో రూట్ లోకి చంద్రబాబు వెళ్లాడని సీఎం జగన్ విమర్శించారు. అనుమతి లేని రూట్ లోకి వెళ్లవద్దని పోలీసులు వారించినా చంద్రబాబు వినలేదన్నారు. అమలాపురంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారంనాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 47 మంది పోలీసులకు గాయాలైన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు అరాచకంతో ఒక పోలీస్ కన్ను కూడ పోగోట్టుకున్నాడని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలనే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు.శవ రాజకీయాలకు కూడ చంద్రబాబు వెనుకాడడం లేదన్నారు.
undefined
ఈ తరహాలోనే నీచ రాజకీయాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కన్పించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.రాబోయే రోజుల్లో ప్రజలను ఇంకా మోసం చేస్తారని చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజీ కారు ఇస్తామని కూడ వాగ్ధానాలు చేస్తారని ఆయన సెటైర్లు వేశారు.తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రయోజనం కలిగితే తనకు మద్దతుగా నిలవాలని సీఎం జగన్ ప్రజలను కోరారు.
also read:నన్ను చంపాలని చూశారు: పుంగనూరు ఘటనపై సీబీఐ విచారణకు బాబు డిమాండ్
ఈ నెల 4వ తేదీన ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటనకు వెళ్లారు. అంగళ్లు నుండి చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటనకు వెళ్తున్న సమయంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంగళ్లు వద్ద చంద్రబాబు వెళ్లే మార్గంలో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు లారీలు అడ్డు పెట్టడంతో తమ శ్రేణులు వాగ్వాదానికి దిగినట్టుగా టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
అయితే రూట్ మార్చుకొని చంద్రబాబు రావడంతో ఈ పరిస్థితి నెలకొందని వైఎస్ఆర్‌సీపీ ఆరోపణలు చేస్తుంది.ఈ ఘటనలపై చంద్రబాబుపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.తమపై దాడి చేసి తనపై కేసులు నమోదు చేయడాన్ని చంద్రబాబు తప్పు బట్టారు. ఈ విషయమై సీబీఐ విచారణ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.