చంపి మానవతావాదిగా డ్రామాలు: చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్

By narsimha lode  |  First Published Jan 3, 2023, 1:36 PM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై  ఏపీ సీఎం జగన్  విమర్శలు గుప్పించారు.  మనుషులను చంపి  వారికి సహాయం చేసి మానవతావాదిగా  చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు.  పబ్లిసిటీ కోసం  చంద్రబాబునాయుడు  ప్రయత్నాలకు  అమాయకులు బలౌతున్నారని  జగన్  చెప్పారు. 
 


రాజమండ్రి: మనుషులను చంపి ఆ కుటుంబాలకు సహయం చేస్తూ  పెద్ద మానవతావాదిగా  చంద్రబాబునాయుడు  డ్రామాలు ఆడుతున్నారని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.మంగళవారం నాడు  రాజమండ్రిలో  నిర్వహించిన  వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో   ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తొలుత పలువురు పెన్షన్ లబ్దిదారులతో జగన్  ముఖాముఖి నిర్వహించారు. అనంతరం  పెన్షన్ దారులనుద్దేశించి జగన్ ప్రసంగించారు.

చంద్రబాబుకు తెలిసింది  ఫోటో షూట్లు, డ్రోన్ షాట్లు, డ్రామాలేనని ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.  తన సభకు జనం ఎక్కువగా వచ్చారని చూపించేందుకు  చిన్న సందులో  రోడ్  షో నిర్వహించడంతో  కందుకూరులో ఎనిమిది మంది మృతి చెందారని  సీఎం జగన్  చెప్పారు. 

Latest Videos

undefined

సీఎంగా ఉన్న సమయంలో పుష్కరాల్లో  డ్రోన్ షాట్ల కోసం  29 మందిని చంద్రబాబు చంపేశారని  జగన్  విమర్శించారు. తానే మనుషుల్ని చంపేస్తాడని చంద్రబాబుపై  మండిపడ్డారు.చనిపోయిన వారు టీడీపీ కోసం ప్రాణత్యాగం చేశారని చంద్రబాబు  చెప్పడాన్ని ఏపీ సీఎం తప్పుబట్టారు. కందుకూరులో ఎనిమిది మందిని చంపేసినా చంద్రబాబుకు రక్తదాహం తీరక గుంటూరులో   ముగ్గురు మృతికి కారణమైనట్టుగా  జగన్  విమర్శించారు.  కొత్త సంవత్సరం రోజు డ్రోన్ షాట్ల కోసం  ముగ్గురు ప్రాణాలను బలిగొన్నారని  సీఎం చెప్పారు.

ఇంటింటికి వెళ్లి చీరలు పంచుతామని టోకెన్లు ఇచ్చారన్నారు.  కానీ  చంద్రబాబు వచ్చేవరకు చీరెలివ్వలేదని జగన్ చెప్పారు. ముందే చీరలు పంపిణీ చేస్తే  జనం వెళ్లిపోతారని భావించి  చీరల పంపిణీ చేయలేదని  సీఎం  విమర్శించారు.  చంద్రబాబు తప్పు చేసి  పోలీసులదే తప్పు అంటున్నాడన్నారు. 

ఇంతా జరుగుతున్న ఎల్లో మీడియా  ఎందుకు నోరు మెదపదని  సీఎం జగన్ ప్రశ్నించారు. దత్తపుత్రుడు ఈ విషయాలపై  ఎందుకు  నోరు మెదపరని  పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు జగన్. 

ఎన్టీఆర్ ను చంపేసి సీఎం సీటును లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని జగన్  విమర్శించారు. ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేసి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడన్నారు. .ఫోటో షూట్ డ్రామాలే చంద్రబాబు నైజమని  సీఎం తెలిపారు. స్వంత మామనే మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసం చేయడం ఓ లెక్కనా అని జగన్  ప్రశ్నించారు.

ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదన్నారుఒకవైపు పేదవాడు  మరోవైపు పెత్తందారీ మధ్య యుద్ధం జరుగుతుందని  సీఎం జగన్  చెప్పారు.పేదవాడికి వ్యతిరేకమైన శక్తులతో  తాను యుద్ధం చేస్తున్నట్టుగా  సీఎం జగన్  ప్రకటించారు. ఈ విషయలో  తాను ప్రజలనే నమ్ముకున్నానని  సీఎం తేల్చి చెప్పారు.పేదవాడికి ఇంగ్లీష్ మీడియా చదువులు , ఇళ్ల పట్టాలు వద్దంటున్నారని విపక్షాల తీరును జగన్  తప్పుబట్టారు.  

ప్రతి ఏటా పెన్షన్ ను పెంచుతామని ఇచ్చిన వాగ్దాన్ని అమలు చేసినట్టుగా  సీఎం చెప్పారు.ప్రస్తుతం పెన్షన్ ను రూ. 2750కి పెంచామని సీఎం జగన్ తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా   రూ. 2750 నుండి  రూ. 10 వేల వరకు   పెన్షన్లను  అందిస్తున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.  పెన్షన్ కోసం  ప్రతి నెల  రూ. 1765 కోట్లను ఖర్చు చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో  39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.   కానీ తమ ప్రభుత్వం  64 లక్షల మందికి  పెన్షన్ అందిస్తున్న విషయాన్ని జగన్  ఈ సందర్భంగా ప్రస్తావించారు.  గత ప్రభుత్వం  వెయ్యి రూపాయాలను పెన్షన్ గా అందించేవారన్నారు.కొత్తగా  రాష్ట్రంలో  44, 543 కొత్త బియ్యం కార్డులను అందజేస్తామని జగన్  ప్రకటించారు. కొత్తగా  14,401 మందికి ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తున్నామని  జగన్ వివరించారు. 
 

click me!