కారణమిదీ: తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్

Published : Jan 03, 2023, 12:22 PM IST
కారణమిదీ:  తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్

సారాంశం

తాడిపత్రి  మున్సిపల్ చైర్మెన్  జేసీ ప్రభాకర్ రెడ్డిని  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లవద్దని  జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు ఆంక్షలు విధించారు. 

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని మంగళవారంనాడు  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు.   శాంతి భధ్రతల దృష్ట్యా  పెన్షన్ల పంపిణీకి  వెళ్లకూడదని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయమై  జేసీ ప్రభాకర్ రెడ్డి  పోలీసుల తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెన్షన్ల పంపిణీకి తనను అధికారులు ఆహ్వానించారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  పోలీసులకు  చెప్పారు. చైర్మెన్  హోదాలో తనకు  పెన్షన్ల పంపిణీకి  ఆహ్వానం పంపారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే