ఆ ఇద్దరు మంత్రులకు అండగా ఉంటా: కేబినెట్ లో జగన్

By narsimha lodeFirst Published Jan 27, 2020, 11:49 AM IST
Highlights

ఏపీ రాష్ట్ర శాసనమండలి  రద్దైతే  ఇద్దరు మంత్రులు తమ పదవులను కోల్పోతారు. 


అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు అండగా ఉంటానని ఏపీ సీఎం వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టుగా సమాచారం.

Also read:కారణమిదే: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వాయిదా

ఏపీ మంత్రివర్గ సమావేశం సోమవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో  ఏపీ శాసనమండలిని రద్దు చేయాలనే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలకు తాను అండగా ఉంటానని  ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.

Also read:ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి కేబినెట్ ఆమోదం

శాసనమండలి రద్దైతే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు తమ పదవులను కోల్పోతారు. జగన్ మంత్రివర్గంలో  వీరిద్దరికి చోటు దక్కింది. శాసనమండలి నుండి వీరిద్దరూ కూడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Also read:ఏపీ శాసనమండలి రద్దైతే ఆ ఇద్దరు మంత్రులకు ఎసరు

శాసనమండలి రద్దైతే  ఈ ఇద్దరు మంత్రులు తమ పదవులను కోల్పోతారు. దీంతో వీరిద్దరిని ఆదుకొంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. అంతేకాదు ఎమ్మెల్సీ పదవిని కూడ ఇచ్చారు.

పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న వీరిద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించారు జగన్.  మండలి రద్దైతే  వీరిద్దరికి మరో రూపంలో పదవులను కల్పించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం లో శాసనమండలి రద్దు తీర్మానానికి ఆమోదం తెలిపింది.
 

click me!