
విజయవాడ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారంనాడు ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.
ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రాభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ ప్రార్ధించాలని ఆయన ముస్లింలను కోరారు. మీ ప్రార్ధనలు సఫలం కావాలన్నారఏపీలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా చెప్పారు. మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు.