బిటెక్ రవికి షాక్: గన్ మెన్ల తొలగింపు

By narsimha lode  |  First Published Apr 17, 2023, 7:20 PM IST

మాజీ ఎమ్మెల్సీ   టీడీపీ నేత బిటెక్ రవి గన్ మెన్లను  ప్రభుత్వం  తొలగించింది. బిటెక్ రవి గన్ మెన్లను  వెనక్కు రావాలని  పోలీస్ శాఖ ఉన్నతాధికారులు  ఆదేశించారు.  


కడప: మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బిటెక్ రవి గన్ మెన్లను  ప్రభుత్వం తొలగించింది. బిటెక్ రవి వద్ద ఉన్న ఇద్దరు గన్ మెన్లను  వెనక్కు రావాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నుండి  గన్ మెన్లకు  సమాచారం అందింది.

ఈ ఏడాది  మార్చి29వ తేదీతో  బిటెక్  రవి  ఎమ్మెల్సీ పదవి  కాలం ముగిసింది. తనకు గన్ మెన్లను  తొలగించడంపై  న్యాయపోరాటం  చేస్తానని  బిటెక్ రవి  ప్రకటించారు.  గతంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ అధికారంలో  ఉన్న సమయంలో  2+2 గన్ మెన్లు ఉండేవారు.  చంద్రబాబు  సర్కార్  గద్దెదిగి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత  1+1 గన్ మెన్లను  కుదించింది  పోలీస్ శాఖ.  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి బిటెక్ రవి  ఇంచార్జీగా  ఉన్నారు. 

Latest Videos

undefined

also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా: సీబీఐకి హైకోర్టు సూచనలు

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వైఎస్  వివేకానందరెడ్డిపై  బిటెక్ రవి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.  ఈ ఎన్నికల్లో బీటెక్ రవి  విజయం సాధించడంపై  వైఎస్ వివేకానందరెడ్డి   పార్టీలోని కొందరిపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారని  ప్రచారం కూడా లేకపోలేదు . వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు  వైఎస్  వివేకానందరెడ్డిని  ఓడించారనే ఆరోపణలు  కూడా  ఉన్నాయి.  వివేకా హత్య  కేసులో  2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అంశాన్ని కూడా  సీబీఐ ప్రస్తావిస్తుంది. 

click me!