కోడి కత్తి కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఇవాళ వైఎస్ జగన్ తరపు న్యాయవాది వాదనలు విన్పించారు.
విజయవాడ: కోడికత్తి కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. కోడి కత్తి కేసులో సోమవారంనాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తరపు న్యాయవాది సుదీర్థంగా వాదనలు విన్పించారు. సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడికి దిగిన శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడిగా జగన్ తరపు న్యాయవాది వాదించారు. శ్రీనివాసరావు సోదరుడు తాను టీడీపీ సానుభూతిపరుడిగా ప్రకటించిన విషయాన్ని జగన్ తరపు న్యాయవాది ఎన్ఐఏ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. లంచ్ కు ముందు లంచ్ తర్వాత సుమారు మూడు గంటల పాటు ఈ కేసుపై జగన్ తరపు న్యాయవాది వాదనలు విన్పించారు.
సినిమా యాక్టర్ శివాజీ అప్పట్లో ప్రకటించిన గరుడ పురాణం అంశాన్ని కూడా జగన్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. జగన్ పై దాడి చేసిన నిందితుడికి రెండు ఈ మెయిల్స్ ఉన్నాయని కూడా జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరో వైపు జగన్ తరపు న్యాయవాది లేవనెత్తిన అంశాలపై కౌంటర్ చేసేందుకు తమకు సమయం కావాలని ప్రత్యర్ధి తరపు న్యాయవాదులు కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది ఎన్ఐఏ కోర్టు.