గుజరాత్ డ్రగ్స్ రాకెట్: అప్రమత్తమైన సీఎం జగన్.. ఎస్ఈబీ అధికారులతో సమీక్ష, కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Sep 23, 2021, 4:47 PM IST
Highlights

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డ 9 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ కేసు మూలాలు విజయవాడలో బయటపడినట్లుగా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. 

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడ్డ 9 వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ కేసు మూలాలు విజయవాడలో బయటపడినట్లుగా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని, మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని చెప్పారు.

బెల్టుషాపులను తీసేశామని.. పర్మిట్‌రూమ్‌లను మూసివేయించామని సీఎం తెలిపారు. లిక్కర్‌ సేల్స్‌ నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయని..  బీరు సేల్స్‌ నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయని వెల్లడించారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అధికారులు అడ్డుకోవాలని జగన్ ఆదేశించారు. అక్రమ రవాణాపైన, అక్రమంగా మద్యం తయారీపైన ఉక్కుపాదం మోపాలన్నారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకువచ్చామని.... ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి అని జగన్ ఆదేశించారు.

ALso Read:గుజరాత్ డ్రగ్స్ కేసు: 8 మంది అరెస్ట్.. నిందితుల్లో ముగ్గురు భారతీయులు

గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలని.. పోలీసు విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ పేర్కొన్నారు.  ఏ కాలేజీలోనైనా అలాంటి ఘటనలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రజల ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపైన ఫోకస్ పెట్టాలని సూచించారు.

click me!