Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ డ్రగ్స్ కేసు: 8 మంది అరెస్ట్.. నిందితుల్లో ముగ్గురు భారతీయులు

గుజరాత్ డ్రగ్స్ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు అధికారులు. కొద్దిరోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ నుంచి గుజరాత్ వెళ్తుండగా 3,400 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. ఈ కేసులో నలుగురు ఆఫ్ఘన్ దేశస్థులతో పాటు ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేశారు.

dri officials arrests 8 victims on gujarat drugs racket
Author
New Delhi, First Published Sep 22, 2021, 9:16 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్ డ్రగ్స్ కేసులో 8 మంది అరెస్ట్ చేశారు అధికారులు. కొద్దిరోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్ నుంచి గుజరాత్ వెళ్తుండగా 3,400 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. ఈ కేసులో నలుగురు ఆఫ్ఘన్ దేశస్థులతో పాటు ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేశారు. సుధాకర్‌తో పాటు మరొక ఇద్దరిని చెన్నైలోని అదుపులోకి తీసుకున్నారు డీఆర్ఐ అధికారులు. టాల్కమ్ పౌడర్ పేరుతో స్మగ్లింగ్ చేస్తోంది ఈ ముఠా. టాల్కమ్ పౌడర్ జంబో బ్యాగుల్లో ప్యాక్ చేసింది ముఠా.

డ్రగ్స్ గుర్తుపట్టకుండా ఉండేందుకు టాల్కమ్ పౌడర్ బస్తాల్లో మత్తుమందు దాచారు. డ్రగ్స్ దిగుమతి వెనుకాల ఢిల్లీకి చెందిన కుల్దీప్ సింగ్ పాత్ర వుందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. గుజరాత్ ముందా పోర్టులో కంటైనర్‌ను పట్టుకున్నాక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూర్, మాండ్వి, గాంధీ ధామ్, విజయవాడలలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీ గోడౌన్‌లో 16 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. అలాగే నోయిడాలో 11 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 

ALso Read:గుజరాత్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్: విజయవాడ ఇంటి అడ్రస్, కుల్‌దీప్‌ కోసం గాలింపు

కాగా, గుజరాత్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. బియ్యం రవాణా పేరుతో డ్రగ్స్ ను సరఫరా చేసినట్టుగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు. విజయవాడలోని ఓ ఇంటి చిరునామా ఇచ్చి డ్రగ్స్  సరఫరా కోసం వినియోగించినట్టుగా గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. కాకినాడ పోర్టు ద్వారా భారీగా డ్రగ్స్ రవాణా అయినట్టుగా డీఆర్ఐ అధికారులు తేల్చారు. విజయవాడలోని సత్యనారాయణపురంలోని ఓ ఇంటి అడ్రస్ ద్వారా ఆశి ట్రేడింగ్ బియ్యం రవాణా చేస్తున్నట్టుగా చెప్పి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ఏడాది జూన్ మాసంలోనే ఆశీ ట్రేడింగ్ కంపెనీకి 25 టన్నుల డ్రగ్ రవాణా అయిందని డీఆర్ఐ గుర్తించింది.రాజస్థాన్ వాసి జయదీప్ లాజిస్టిక్ ద్వారా కాకినాడ కు డ్రగ్స్ రవాణా అయిందని అధికారులు అనుమానిస్తున్నారు. లారీ నెంబర్ ఆర్ జే 01 జీబీ 8328 ద్వారా డ్రగ్స్ సరఫరా అయిందని అధికారులు గుర్తించారు. తప్పుడు అడ్రస్ లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని గుర్తించారు.బియ్యం, టాల్కం పౌడర్ పేరుతో డ్రగ్స్  సరఫరా చేస్తున్నారని  అధికారులు అనుమానిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios