కర్నూల్ జిల్లాలో వింత ఆచారం: గాడిదలకు పెళ్లి, ఎందుకంటే?

By narsimha lode  |  First Published Sep 23, 2021, 4:22 PM IST

వర్షాలు సమృద్దిగా కురవాలని కోరుతూ గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు కర్నూల్ జిల్లా వాసులు. కర్నూల్ జిల్లాలోని పత్తికొండ హోసూరులో రెండు గాడిదలకు పెళ్లిళ్లు చేశారు స్థానికులు. ఈ తతంగంపై సోషల్ మీడియాలో వీడియోలు తీసి పోస్టు చేశారు.


కర్నూల్:వర్షాలు( Rain)సమృద్దిగా కురవాలని  కోరుతూ గాడిదలకు(donkey) ఘనం గా పెళ్లి చేశారు కర్నూల్ (kurnool) జిల్లా వాసులు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటారు. తరాలు మారినా కూడ ఈ ఆచారాలు, సంప్రదాయాలను ప్రజలు కొనసాగిస్తుంటారు. కర్నూల్ జిల్లాలో కూడ తమ పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాలను స్థానికులు కొనసాగిస్తున్నారు.

వర్షాలు సమృద్దిగా కురవాలని కోరుతూ రెండు గాడిదలకు పెళ్లి చేశారు కర్నూల్ జిల్లావాసులు. జిల్లాలోని పత్తికొండ మండలం హోసూరులో(hosur) ఈ ఘటన చోటు చేసుకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ హోసూరు గ్రామ ప్రజలు వాసుదేవ కళ్యాణ మహోత్సవం (marriage)నిర్వహించారు. 

Latest Videos

undefined

ఇందులో బాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. అనంతరం  ఊరేగింపు నిర్వహించారు.  హోసూరు ప్రాంతంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం. 

 అచ్చం మనుషులకు ఎలాగైతే పెళ్లి తంతు నిర్వహిస్తారో గాడిదలకు కూడా అలాగే నిర్వహించారు. అయితే, గతంలో కూడా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు విస్తారంగా కురిశాయని అందుకే ఈ సంవత్సరం కూడా గాడిదలకు పెళ్లిళ్లు చేస్తున్నామని స్థానికులు చెప్పారు. ఈ గాడిదల పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. 

click me!