ఏపీ: 24 గంటల్లో 148 మందికి కరోనా.. చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Dec 16, 2021, 06:08 PM IST
ఏపీ: 24 గంటల్లో 148 మందికి కరోనా.. చిత్తూరులో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 148 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 152 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,814 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా (corona cases in ap) తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 148 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,72,524కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,474కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 152 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,56,236కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 33,043మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,08,95,748కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1814మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 5, చిత్తూరు 34, తూర్పుగోదావరి 11, గుంటూరు 16, కడప 3, కృష్ణ 14, కర్నూలు 0, నెల్లూరు 10, ప్రకాశం 4, శ్రీకాకుళం 18, విశాఖపట్నం 10, విజయనగరం 5, పశ్చిమ గోదావరిలలో 18 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 


 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !