
వాయుగుండం ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలవుతున్న సంగతి తెలిసిందే. రెండ్రోజులుగా పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు, వాగులు వంకలు, చెరువులు, జలాశయాలు వరదతో పోటెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో బీభత్సం నెలకొంది. కడప, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా వుంది. పెన్నా ఉగ్రరూపం (Penna river) దాల్చడంతో ఇప్పటికే కోవూరు (kovvur) వద్ద జాతీయ రహదారి తెగిపోయింది.
ఇక శనివారం రాత్రి నెల్లూరు జిల్లాలోని పడుగుపాడు వద్ద రైలు పట్టాలపై నీళ్లు చేరాయి. కొద్ది వ్యవధిలోనే వరద నీరు ట్రాక్‌ను కమ్మేసింది. దాంతో విజయవాడ - చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఎగువనుంచి నీటి ప్రభావం ఉద్ధృతంగా రావడంతో పట్టాల కింద ఉన్న కంకర కొట్టుకుపోయి కేవలం గాల్లో వేళ్లాడుతూ పట్టాలు మాత్రం మిగిలాయి. దీంతో ముందు జాగ్రత్తగా రాకపోకలు నిలిపివేశారు. అటు రెండు రోజులుగా కడప జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పాపాగ్ని నదిపై (papagni river) ఉన్న వంతెన కుప్పకూలింది. కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కుప్పకూలింది. అయితే ఈ సమయంలో వంతెనపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వంతెన కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ALso ReadHeavy rains in AP: కొట్టుకుపోయిన పాపాగ్ని బ్రిడ్జి, కడపలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం
వెలిగల్లు జలాశయం (veligallu reservoir) నాలుగు గేట్లు ఎత్తారు. దీంతో వరదనీరు భారీగా వంతెనపై అంచువరకు రెండు రోజులుగా ప్రవహించడంతో వంతెన బాగా కుంగిపోయింది. దీంతో ఈ వంతెనపై ప్రమాదం రాకపోకలకు ప్రమాదం కలుగుతుందని భావించారు. అర్ధరాత్రి వంతెన కుప్పకూలింది. ఏడు మీటర్లకు పైగా వెంతన కూలడంతో కిలోమీటర్ దూరంలోనే వాహనాలను నిలిపివేశారు. కడప నుండి అనంతపురం వెళ్లే జాతీయ రహదారి కావడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. కడప నుండి తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులను , ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా మళ్లించారు.